Viral Video : రెండేళ్ల కిందట చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చాడు.. వీడియో వైరల్..!!
Viral Video : రెండు సంవత్సరాల క్రితం కరోనా కారణంగా చాలామంది మరణించడం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అత్యంత ఈ ప్రమాదకరమైన వైరస్ ని అరికట్టడానికి ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలు బిక్కుబిక్కుమన్నాయి. ఈ క్రమంలో వైరస్ బారిన పడిన వారిని చూడటానికి కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాని పరిస్థితి. కరోనా సోకింది అంటే… మరి దారుణంగా చూసే […]
Viral Video : రెండు సంవత్సరాల క్రితం కరోనా కారణంగా చాలామంది మరణించడం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అత్యంత ఈ ప్రమాదకరమైన వైరస్ ని అరికట్టడానికి ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలు బిక్కుబిక్కుమన్నాయి. ఈ క్రమంలో వైరస్ బారిన పడిన వారిని చూడటానికి కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాని పరిస్థితి. కరోనా సోకింది అంటే… మరి దారుణంగా చూసే పరిస్థితి గతంలో ఉండేది.
కరోనా సోకిన వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా చుట్టుపక్కల ప్రజలు చాలా వెలివేసేటట్టు చూసేవారు. ఇక కరోనా సోకి చనిపోయిన వ్యక్తి యొక్క మృతదేహాన్ని సదరు కుటుంబ సభ్యులు సరిగ్గా ఖననం కూడా చేసే పరిస్థితి ఉండేది కాదు. ఈ రకంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం ఓ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ తార్ అనే ప్రాంతానికి చెందిన కమలేష్ అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం కరోనా కారణంగా హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఆ సమయంలో ఆ వ్యక్తి మరణించినట్లు మృతదేహాన్ని ఇంటికి పంపించారు. అయితే కరోనా సోకి మరణించడంతో కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మృతదేహాన్ని ఓపెన్ చేయకుండా ఖననం చేయడం జరిగింది.
అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదే సమయంలో రెండు సంవత్సరాలు నుండి కమలేష్ కి మరణ అనంతరం చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో తాజాగా కమలేష్ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఊరిలోకి వచ్చి మొదట పిన్ని ఇంటి తలుపు తట్టడం జరిగిందట. అయితే కమలేష్ ఎలా వచ్చాడు..? రెండు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు..? విషయాలు చెప్పటం లేదనీ స్థానిక పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు అప్పుడు అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరు..? వివరాలు కూడా కనుక్కోబోతున్నట్లు పోలీసులు తెలియజేశారు.