Viral Video : భయం లేదు , బాధ్యత లేదు .. హైదరాబాద్ రద్దీ రోడ్లమీద బైక్ స్టంట్స్ చేస్తున్న పోకిరీలు.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : భయం లేదు , బాధ్యత లేదు .. హైదరాబాద్ రద్దీ రోడ్లమీద బైక్ స్టంట్స్ చేస్తున్న పోకిరీలు.. వీడియో !

Viral Video : ఎంతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై కుర్రాళ్ళు బైక్ స్టంట్ bike stunts లతో హడలెత్తిస్తున్నారు. బైకుల Bikeపై విన్యాసాలు చేస్తూ తోటి ప్రయాణికులను భయపెడుతున్నారు. బైక్ విన్యాసాలపై పోలీసులు ఎంత నిఘా పెట్టిన, ఎన్ని హెచ్చరికలు చేసిన కొందరు ఆకతాయిలు మాత్రం ఆగటం లేదు. పటిష్టమైన భద్రతా ఉండే హైదరాబాద్లోని సచివాలయం ఎదుట బైకులపై విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి బైక్ స్టంట్ లు చేస్తూ తోటి వారిని […]

 Authored By anusha | The Telugu News | Updated on :24 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : భయం లేదు , బాధ్యత లేదు ..

  •  హైదరాబాద్ రద్దీ రోడ్లమీద బైక్ స్టంట్స్ చేస్తున్న పోకిరీలు.. వీడియో !

Viral Video : ఎంతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లపై కుర్రాళ్ళు బైక్ స్టంట్ bike stunts లతో హడలెత్తిస్తున్నారు. బైకుల Bikeపై విన్యాసాలు చేస్తూ తోటి ప్రయాణికులను భయపెడుతున్నారు. బైక్ విన్యాసాలపై పోలీసులు ఎంత నిఘా పెట్టిన, ఎన్ని హెచ్చరికలు చేసిన కొందరు ఆకతాయిలు మాత్రం ఆగటం లేదు. పటిష్టమైన భద్రతా ఉండే హైదరాబాద్లోని సచివాలయం ఎదుట బైకులపై విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి బైక్ స్టంట్ లు చేస్తూ తోటి వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఇలాంటి స్టంట్ లు అర్ధరాత్రి సమయంలో చేసేవారు. కానీ ఇప్పుడు పట్టపగలే బైకులతో విన్యాసాలు చేస్తూ సినిమా హీరోల్లా ఫీల్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని జనాలను బెంబేలెత్తిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం రిస్కులో పెడుతున్నారు. ఓఆర్ఆర్ స్టీల్ బ్రిడ్జ్ లతో పాటు నగరంలోని అన్ని రోడ్లు తమవే అన్నట్లు రోడ్డుమీద బైక్ స్టంట్ లు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎంతో భద్రత ఉండే సచివాలయం వద్ద బైక్ స్టంట్స్ చేస్తున్నారంటే వారికి ఏమాత్రం భయం లేదని, బాధ్యత లేదని తెలుస్తుంది.

వారి సరదాల కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి వారి ప్రాణాలను రిస్కులో పెట్టడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు వాళ్లపై పెట్టుకున్న ఆశలను కూడా పట్టించుకోవడం లేదని అనుకోవాలి. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు కొనిస్తుంటారు. కాని వాళ్ళు ఏం మాత్రం బాధ్యత లేకుండా చేస్తున్న బైక్ స్టంట్ ల వలన ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినా పోకిరీలు మాత్రం ఇలాంటి విన్యాసాలు చేయడం మాత్రం మానడం లేదు. గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్న ఆకతాయిల విన్యాసాలకు అడ్డుకట్ట పడటం లేదు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది