Viral Video : మహిళలపై గుంట నక్క దాడి.. మహిళ పరిస్థితి విషమం.. వైరల్ వీడియో
ప్రధానాంశాలు:
Viral Video : మహిళలపై గుంట నక్క దాడి.. మహిళ పరిస్థితి విషమం.. వైరల్ వీడియో
Viral Video తెలంగాణలో ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు జనావాసాలలోకి కూడా వస్తున్నాయి. తాజాగా ఒక గుంటనక్క కూడా జనావాసాల్లోకి రావటమే కాదు మనుషులపై దాడి చేసింది. గ్రామనికి చెందిన సూత్రం రాధ (34) అనే వివాహిత.. ఉదయం ఐదున్నర సమయంలో లేచి వాకిలి ఊడుస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ నక్క ఆమెపై దాడికి తెగబడింది. మొదట కుక్క అనుకుని వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది.
Viral Video ముగ్గురికి గాయాలు..
వెళ్లిపోయినట్టుగానే వెళ్లిపోయిన ఆ గుంటనక్క ఊడుస్తున్న సమయంలో ముందు నుంచి వచ్చి ముఖం, మెడపై దాడి చేసింది. ఈ దాడిలో రాధ ముఖం ఛిద్రం కాగా.. మెడకు కూడా గాట్లు పడ్డాయి. ఆరున్నర సమయంలో సైలెంట్‌గా వచ్చిన నక్క.. రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తి కాలిని కరిచింది. తాను మొదట కుక్క అనుకుని వెళ్లగొట్టగా.. తర్వాత నక్క అని గుర్తించారు. అక్కడ కొడితే ఇక్కడికొచ్చినట్టు.. ముందు కట్టెతో కొట్టిన వ్యక్తిపైన మళ్లీ దాడి చేసింది ఆ గుంట నక్క. దీంతో.. ఈసారి కట్టెతో బలంగా కొట్టటంతో.. దెబ్బకు ఆ నక్క చచ్చి ఊరుకుంది.
నక్క దాడిలో గాయపడిన రాధను హుటాహుటిన ముస్తాబాద్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యం చేస్తున్నారు. ముఖంపై తీవ్రంగా గాయాలు కావటంతో.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మిగతా ఇద్దరి మీద కూడా దాడి చేయగా.. వారికి కూడా కాళ్లకు బలంగానే గాట్లు పడ్డాయి. అయితే.. రాధకు ఇటీవలే కిందపడిపోగా నడుము తీవ్రంగా గాయమైందని.. దాని నుంచి కాస్త కోలుకుంటుందనుకునేలోపే ఈ గుంటనక్క దాడి చేసిందని స్థానికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.