Viral Video : పక్షులు గొప్ప ఇంజనీర్లు తమ నివాసాలు.. గూళ్లు చాలా పకడ్బందీగా ముందు చూపుతో నిర్మించుకుంటాయి. అవి నిర్మించుకునే తీరు చూస్తే ముచ్చటేస్తుంది. అయితే చాలా రకాల పక్షులు గూడు కట్టుకోవడం కోసం పెద్ద యుద్దమే చేస్తుంటాయి. అందుకోసం అవి.. గడ్డి పోచలు, వివిధ రకాల ఆకులు, పీచులతో పాటు చిన్న కట్టె పుల్లలను తీసుకువచ్చి అందంగా ఇల్లును నిర్మించుకుంటాయి.
అయితే కొన్ని రకాల పక్షులు గూడు కోసం జంతువుల నుంచి వాటి జుట్టును కూడా పెరికేస్తాయి. ఈ క్రమంలో జంతువుల ఆగ్రహం కారణంగా వాటి చేతిలో గాయపడటమో లేదంటే చనిపోవడమో జరుగుతుంది. అయితే పక్షులకు గూడా చాలా ముఖ్యం ఎందుకంటే అవి ఎండా వానలకు తమను తాము రక్షించుకోవడానికి.. అలాగే గుడ్లు పెట్టడానికి పిల్లలను పెంచడానికి చాలా అవసరం. అందుకే ఎంత కష్టమైనా గూడూ ఏర్పరుచుకుంటాయి. అప్పుడప్పుడు గాలివానలకు పక్షుల గూళ్లు చెదిరిపోతుంటాయి.

అయినా కూడా తిరిగి గూడును నిర్మించుకుంటాయి.కొన్ని పక్షులు జంతువులన బొచ్చుతో కూడా గూడు నిర్మించుకుంటారయి. ఎందుకంటే చలికాలంలో అవి వెచ్చదనాన్ని ఇస్తాయి కాబట్టి అందుకే పక్షులు తెలివైనవిగా చెప్పవచ్చు. ప్రస్తుతం కొన్ని పక్షులు కూడా జింక బొచ్చును నోటితో పీకుతూ కనిపించాయి. జింక కాస్తా బెదిరించినా కూడా అవి పైకి ఎగురుతూ మళ్లి బొచ్చు సేకరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు కూడా చూసేయండి అదేంటో……
Jackdaws collecting fur from a deer to build nests with…🦌𓅨🪹😍 pic.twitter.com/vUVL0pSNch
— 𝕐o̴g̴ (@Yoda4ever) April 18, 2022