Viral Video : ఇదే మ్యాజిక్ రా బాబు.. సిగరెట్లు ఇలా తినేస్తున్నాడు..
viral video : మ్యాజిక్ అంటేనే ట్రిక్‌తో చేస్తారు. మ్యాజిక్‌ను చూసి చాలా సార్లు అవాక్కవుతుంటాం. అసలు.. ఎలా చేశాడు ఈ మ్యాజిక్ అని తలగోక్కుంటాం. ఎలా జరిగింది అని అనుకుంటాం. ఎంత ఆలోచించినా అంతు చిక్కదు. అసలు ఈ మ్యాజిక్ ఎలా చేస్తారు బాబోయ్ అనుకుంటాం. మనందరికీ మ్యాజిక్ నచ్చుతుంది. చూడ్డానికి ఎంతో బాగుంటుంది. దాని వెనక లాజిక్ తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయినా అంతు పట్టదు.
ఇలా సోషల్ మీడియాలో కూడా కొన్ని మ్యాజిక్ వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టామ్ ముల్లికా.. అనే మెజీషియన్ ఓ షో లో సిగరెట్లను తాగుతూ నోట్లోంచి, చేవుల్లోంచి, ముక్కులో నుంచి పొగను బయటకి వదులుతున్నాడు. ఇలా ఒక సిగరేట్ తో చేశాడు. మరో మూడు సిగరెట్లు ఒకే సారి తాగుతూ నోట్లోకి మింగేస్తున్నాడు. మళ్లి కొన్ని సిగరేట్లు తీసుకుని లైటర్ తో అంటించి తాగుతున్నాడు.

Viral Video in The magician was smoking cigarettes
ఇదివరకు నోట్లోకి మింగిన సిగరెట్లను మళ్లీ బయటకు తీస్తున్నాడు. ఇలా చాలా రకాలుగా సిగరేట్లతో తన ట్రిక్స్ ప్లే చేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు. ఇది ఎప్పుడో ఎక్కడో జరిగిన షో అయినప్పటికి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. మీరు కూడా ఆ వీడియో ఒకసారి చూసి అది ఎలా జరిగిందో చెప్పండి చూద్దాం.
Wooooowww magic ???????????????????????? pic.twitter.com/SV91UvUAV8
— güldür güldür (@guldurbakalim) March 18, 2022