Viral Video : ఇదేం కోడిరా బాబు.. ఇలా ఉందేంటి?
Viral Video : కోడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊరి కోళ్లను పట్టుకోవాలంటే అదొక సాహసమనే చెప్పాలి. గూట్లో నుంచి కోడి బయటకు వెళ్లిందంటే అది తిరిగి గూటికి వచ్చే వరకు ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఆ టైంలో దానిని పట్టుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఊరి కోడి పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. చాలా మంది ఫారం కోడిని తినడం కంటే ఊరి కోడిని తినేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.
దీని ధర కూడా ఎక్కువే మరి. ఇక కోళ్లు దాదాపుగా అన్ని ఓకే లాగే ఉంటాయి. పుంజులు ఒకలా ఉంటే పెట్టెలు మరోలా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఓ కోడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కోడికి చెందిన వీడియో వైలర్ అవుతోంది. అందులో కోడి ముందుకు నడుచుకుంటూ వస్తోంది.

Viral Video in this hen style is different
Viral Video : జిమ్ కు పోయిందా?
ఇక ఎక్కడైన కోడి తల ముందుకు ఉంటుంది. తర్వాత రెక్కలు, ఆ తర్వాత తోక ఉంటుంది. కానీ ఈ కోడి చాలా డిఫరెంట్ గా ఉంది. బాడీ బిల్డింగ్ చేసినట్టుగా చాతిని బయటకు పెట్టి నడుస్తూ ఉంది. ముందు చాతి భాగం ఉన్నాక తోకపై తల ఉంది. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. డిఫరెంట్ కామెంట్స్ సైతం పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా ఓ సారి చూసెయ్యండి.
First day after Gym. ???????? pic.twitter.com/n76A2Jrpcm
— Nature Life (@Nature_Life123) March 15, 2022