Viral Video : క‌లిచి వేసే సంఘ‌ట‌న‌.. బ‌తుకు దెరువు కోసం బండిమీద వెళ్లి, దానిపైనే మృత్యువు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : క‌లిచి వేసే సంఘ‌ట‌న‌.. బ‌తుకు దెరువు కోసం బండిమీద వెళ్లి, దానిపైనే మృత్యువు..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 October 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : క‌లిచి వేసే సంఘ‌ట‌న‌.. బ‌తుకు దెరువు కోసం బండిమీద వెళ్లి, దానిపైనే మృత్యువు..!

Viral Video : ఈ ప్ర‌పంచంలో మ‌నిషి త‌న జీవితాన్ని సాఫీగా న‌డిపించుకోవ‌డం చాలా క‌ష్టం అనిపిస్తుంది. ఎప్పుడు ఎలాంటి ప్ర‌మాదాలు ఫేస్ చేయాల్సి వ‌స్తుందో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. కాయా కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఓ వైపు పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో మూడు పూటలు తినలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. చాలీ చాలనీ జీతాలతో సంసార సాగరాన్ని ఈదుతూ వస్తున్నారు. ఏ ఉద్యోగం లేని వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.ఒడిషాలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ 40 ఏండ్ల ఓ వ్యక్తి టీవీఎస్ బండికి తినుబండారాలు కట్టుకొని వాటిని వీధుల్లో తిరుగుతూ అమ్ముతాడు.

Viral Video నిజంగా దారుణం..

ఎప్పటిలాగే తినుబండారాలను అమ్మేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి వర్షం పడుతుండడంతో ఒక దగ్గర ఆగాడు. ఇంతలోనే గుండెపోటు రావడంతో బండి మీదే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోజు మాదిరిగానే ఆ రోజు కూడా తినుబండారాలు అమ్మడానికి బయలుదేరాడు. కాసేపు వీదుల్లో తిరిగాడు. ఆ తర్వాత అతడు బండిమీద నిద్ర పోతున్నట్లు కనిపించాడు. ఆ దారిలో వచ్చిపోయే వారు అతన్ని చూస్తూ వెళ్తున్నారు. అయితే ఆ వ్యక్తిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.సదరు వ్యక్తి దగ్గరకు వచ్చిన కొందరు అతన్ని పిలిచిచినా.. కదిలించి చూసినా ఉలుకూ పలుకూ లేదు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Viral Video క‌లిచి వేసే సంఘ‌ట‌న‌ బ‌తుకు దెరువు కోసం బండిమీద వెళ్లి దానిపైనే మృత్యువు

Viral Video : క‌లిచి వేసే సంఘ‌ట‌న‌.. బ‌తుకు దెరువు కోసం బండిమీద వెళ్లి, దానిపైనే మృత్యువు..!

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. హుటా హుటినా ఆసుపత్రికి తరలించగా.. వాహనంపై కూర్చొని ఉండగానే గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బతుకు బండిని లాగించిన ఆ బండిమీదనే గుండెపోటుతో మరణించడంతో ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రాణం నీటి మీద బుడగలాంటిదని ఎప్పుడు చిట్లి పోతుందో ఊహించలేమని ప్ర‌తి ఒక్క‌రు చాలా ఎమోష‌న‌ల్‌గా కామెంట్ చేస్తున్నారు.ఇప్పుడు అత‌డి కుటుంబం ప‌రిస్థితి ఏంటో అని అంద‌రు ఆలోచ‌న చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది