Viral Video : ఎవరి కంటపడకుండా జేబులో పెట్టి వెళ్లిపో.. ట్రాఫిక్ పోలీస్ వసూల్
Viral Video : సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కడ ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. అది మంచైనా.. చెడైనా.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎంతటి వారైనా దిగి వచ్చేలా చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో ఫన్నీ వీడియోస్.. యాక్సిడెంట్స్.. పేదలకు హెల్ప్ చేస్తున్న వీడియోలు.. జంతువులు గాయపడి రోడ్డుపై విలవిల లాడుతుంటే ఎవరో ఒకరు మానవత్వంతో వాటిని చేరదేసే వీడియోలు ఇలా ఎన్నో వైరల్ అవుతుంటాయి.. ఈ మధ్య ఓ ట్యూషన్ టీచర్ చిన్న బాలుడిని చావ కొట్టాడు. విపరీతంగా ఇష్టం వచ్చినట్లు బాదేశాడు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్యలు తీసుకున్నారు.
రీసెంట్ గా ఓ ఎమ్మార్వో లంచం తీసుకుంటుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ కాగా సస్పెండ్ చేశారు. ఇలా ఎన్నో అక్రమాలను కూడా స్మార్ట్ ఫోన్ తో వీడియోలు తీసి ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్లకి సాయం చేయమని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఎంతో కొంత సాయం అంది ప్రాణాలు దక్కించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావంతో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. అయినా ఎలాగోలా తీసుకుంటునే ఉన్నారు. కొత్తగా ఆలోచిస్తున్నారు. ఎవరి కంటా పడకుండా ఎక్కడో ఒక చోట పెట్టి వెళ్లమని
లేదా వాళ్లు చెప్పిన వ్యక్తలకు ఇవ్వమని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్న ఓ లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్ లంచం తీసుకోవడానికి తన తెలివిని చూపించింది. రోడ్డుపై వెహికిల్స్ ఆపి చెక్ చేస్తుండగా ఓ యువతి వద్ద లంచం డిమాండ్ చేసింది. అయితే నేరుగా తీసుకోకుండా తన వెనకాల జేబులో పెట్టమని చెప్పింది. దీంతో సదరు యువతీ డబ్బులను ఆమె చెప్పినట్లుగానే జేబులో పెట్టి వెళ్లిపోయింది. అయితే పై నుంచి ఎవరో వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.