Viral Video : కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న భర్తని చూసుకుంటున్నా భార్య.. ఒకసారిగా భర్త మరణించడంతో తట్టుకోలేక ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసింది. ఈ ఘటన చుట్టుపక్కల ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఆమె తన భర్తకి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవలకు.. మానసిక సంఘర్షణకు లోని డిప్రెషన్ గుండా వెళ్ళటంతో భర్త మరణాన్ని తట్టుకోలేక ఆ రకంగా వ్యవహరించినట్లు పెద్ద కొడుకు మీడియాకి తెలియజేశారు.
తన తండ్రిని బతికించుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్ లకి చూపించడంతోపాటు అనేక దేవాలయాలకు తిరగడం జరిగిందని తెలిపారు. వాళ్ల పెద్ద కుమారుడు దినేష్ కూడా వైద్యుడు కావడంతో.. తన తండ్రిని బతికించుకోవడానికి సాయి శక్తుల అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తల్లి ఎంతో ఆవేదనకు గురై..

తండ్రి మరణించడంతో ఆ రకంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా అందరం సెటిల్ అయినవారమే. మా తమ్ముడు విదేశాలలో స్థిరపడ్డారు. నేను వైద్యుడిగా ఇక్కడే స్థిరపడ్డాను. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేక ఆ రకంగా తన తల్లి ఇంట్లోనే మృతదేహాన్ని దహనం చేసినట్లు పెద్ద కొడుకు దినేష్ మీడియాకి స్పష్టం చేయడం జరిగింది.