Viral Video : అలా సంగీతం వింటూ సంతోషంగా చిందేస్తున్న కొంగలు..!
Viral Video : సంగీతం విని తరించడం అనేది మంచి విషయమని పెద్దలు చెప్తుంటారు. అలా మ్యూజిక్ విని ఆనందించడం మనుషుల పని అని మీరు అనుకుంటే పొరపడినట్లే.. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో కొంగలు హ్యాపీగా సంగీతం వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా జంప్ చేస్తూ జాయ్ ఫుల్‌గా గడిపేస్తున్నాయి.బ్యూటెన్ జెబైడెన్ అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియోలో కొంగలు చాలా ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్నాయి.
‘జంప్ ఫర్ జాయ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడిన వీడియోలో కొంగలు ఒక కోర్టులో మ్యూజికల్ బీట్స్‌కు తగ్గట్లు స్టెప్స్ వేస్తున్నాయి.కొంగలు ఒక్కొక్కటిగా అలా కోర్టులో రెక్కలను పైకి లేపుతూ సరదాగా స్టెప్స్ వేస్తున్నాయి. ఆ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగీతం విని కొంగలు మైమరిచిపోయి స్టెప్పులు వేస్తున్నాయని ఈ వీడియో చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

storks video viral in social media
Viral Video : అలా రెక్కలతో కొంగల డిఫరెంట్ మూమెంట్స్..
మొత్తంగా ఈ వీడియో చూసి నెటిజన్లు అయితే తెగ సంబురపడిపోతున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు పిట్టలు డ్యాన్స్ చేసిన వీడియోలు షేర్ చేయగా, మరి కొందరు బాతులు డ్యాన్స్ చేసిన వీడియోలు పోస్టు చేస్తున్నారు. అలా ప్రకృతిలో ఉండే ఇతర జంతువులు కూడా సంగీతం విని తరిస్తాయని విషయాన్ని నెటిజన్లు చెప్పకనే చెప్తున్నారు.
Jump for joy.. ???????? pic.twitter.com/Xe3pLGIA2K
— Buitengebieden (@buitengebieden_) January 22, 2022