Viral Video : వరుడు రావడం కాస్త ఆలస్యం అయిందని.. ఆ వధువు ఏం చేసిందో చూడండి
Viral Video : సాధారణంగా చాలా పెళ్లీలు టైంకి జరగవు.. కాస్తా అటు ఇటుగా కొంత లేటైనా జరుగుతుంటాయి. వధూవరులు.. ఇరువైపుల బంధువులు కొంత లేట్ చేసినా సామరస్యంతో పెళ్లి జరిపిస్తారు. బంధువులు లేట్ అయినా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే చాలు సమయానికి పెళ్లి చేస్తారు. అలాంటిది పెళ్లికి వరుడే లేట్ వస్తే… ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది.. అసలు పెళ్లికే లేటు వచ్చే దరిద్రులు ఉంటారా.. అవును ఉంటారని ఈ సంఘటన నిరూపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..అయితే పెళ్లి కొడుకు బలమైన కారణం ఉంటే తప్పా లేటు వస్తే క్షమించరు..
ఎందుకంటే పెళ్లంటే బాధ్యతలేనివాడికి తమ కూతురిని బాధ్యతగా చూసుకుంటాడని ఏ పేరెట్స్ అనుకోరు కాబట్టి. అయితే మహారాష్ట్రలో పెళ్లికి లేటుగా వచ్చిన వరుడికి పెళ్లి కూతురు తండ్రి గట్టి షాక్ ఇచ్చాడు. బాధ్యతలేని బలాదూర్ తో పెళ్లికి వధువు కూడా నిరాకరించిం. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మల్కాపూర్ పాంగ్రా గ్రాంలో ఏప్రిల్ 22న పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లి ముహూర్తం కాగా పెళ్లి రోజు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ మండపానికి చేరుకున్నారు. వరుడు మాత్రం రాలేదు. ఎంతో ఓపికతో ఎదురు చూశారు..
కానీ ఆ పెళ్లి కొడుకు మద్యం సేవించి ఫ్రెండ్స్ తో, బంధువులతో డ్యాన్స్ చేస్తూ ఏకంగా ఎనిమిది గంటలకు మండపానికి తన వారితో చేరుకున్నాడు.దీంతో వధువు తండ్రి వరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనతో పెళ్లి జరిపించేదిలేదని తేల్చిచెప్పాడు. అంతేకాకుండా పెళ్లికి వచ్చిన తన బంధువుతో మాట్లాడి అతని కుమారుడితో వివాహం జరిపించాడు. ఈ న్యూస్ కాస్తా వైరల్ అవుతోంది. పెళ్లి కూతురు తండ్రి చాలా మంచి పని చేశాడని… పెళ్లంటే బాధ్యత లని పెళ్లికొడుకుకి తిక్క కుదిరిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి లేటెందుకు మీరు కూడా చూసి ఆ బాధ్యత లేని పెళ్లి కొడుకుపై స్పందించండి.