Viral Video : మొదటిసారి కరెంటు వెలుగు చూసిన ఆ పల్లె.. ఆనందంలో చిందులు వేసిన మహిళలు..!
ప్రధానాంశాలు:
Viral Video : మొదటిసారి కరెంటు వెలుగు చూసిన ఆ పల్లె.. ఆనందంలో చిందులు వేసిన మహిళలు..!
Viral Video : ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎక్కడికో వెళ్తుంది. ఏ.ఐ కూడా వచ్చి ఎవరి అవసరం లేకుండా మొత్తం కంప్యూటర్లే చేసేస్తున్నాయి. ఐతే ఇది అంతా ఒక పక్కే మరో సైడ్ ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నాయి.
ఆ గిరిజన గ్రామాల్లో కరెంట్ అనేది ఉండదు. సాయంత్రం సూర్యుడు పోతే వారి వెలుగు పోతుంది. ఐతే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామంలో ఇన్నాళ్లకు విద్యుత్ సౌఅర్యం ఏర్పాటు చేశారు. మొదటిసారి లైట్ వెలుతు చూసిన ఆ గ్రామ మహిళలు తమ సంతోషాన్ని థింసా నృత్యంతో వెల్లడించారు.
వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోవడం కామన్. ఒక 10 నిమిషాలు కరెంట్ పోతేనే అల్లాడిపోతుంటారు కొందరు. కానీ అక్కడ విద్యుత్ ఇప్పుడు వచ్చింది అంటే.. వారి జీవితాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇ లాంటివి చూసినప్పుడైనా మనం ఎంత సాంకేతికంగా ముందుకు వెళ్తున్నామో మనకు దగ్గర్లోనే వెనకపడిన ప్రాంతాలు కనీస అవసరాలు కూడా లేని ప్రజలు నివసిస్తున్నారు అన్న ఆలోచన రావాలి. Viral Video, Tribal Area, First Light, Happyness
స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత గిరిజన గ్రామంలో తొలిసారి వెలిగిన లైట్లు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట (మ) అర్ల పంచాయతీ లోని నీలబంద గ్రామంలో స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం రావడం, మొదటి లైట్ వెలగడంతో గ్రామ ప్రజలు ఆనందంతో థింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. pic.twitter.com/yTk8l56BSB
— greatandhra (@greatandhranews) February 3, 2025