Viral Video : పెంపుడు కుక్కతో వెళ్లి గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య.. కుక్క ఏం చేసిందంటే.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెంపుడు కుక్కతో వెళ్లి గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య.. కుక్క ఏం చేసిందంటే.. వీడియో వైరల్

 Authored By kranthi | The Telugu News | Updated on :18 July 2023,5:00 pm

Viral Video : కుక్కల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెంపుడు కుక్కలు. అవి చాలా నమ్మకంగా ఉంటాయి. యజమానికి అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. అందుకే కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా లేదంటారు పెద్దలు. కుక్కకు అంత విశ్వాసం ఉంటుంది కాబట్టే చాలామంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈరోజుల్లో ప్రతి ఇంట్లో కుక్క ఉండటం కామన్ అయింది.సాధారణంగా ఏ కుక్క అయినా తమ యజమానికి సంబంధించిన ఏ వస్తువును వేరే వాళ్లను ముట్టుకోనివ్వదు. యజమాని ఇంటికి ఎవరు వచ్చినా కూడా కుక్కలు వెంటనే అరుస్తుంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దానికి కారణం.. ఆ కుక్క యజమానిపై చూపించిన వాత్సల్యం. ఓ మహిళ తన పెంపుడు కుక్కను తీసుకొని గోదావరి నది బ్రిడ్జి దగ్గరికి వెళ్లింది. బ్రిడ్జి మీద కుక్కను వదిలేసి.. తన చెప్పులు కూడా అక్కడే విప్పి బ్రిడ్జి మీది నుంచి దూకేసింది. ఆ కుక్కకు ఆ విషయం తెలియక.. ఆమహిళ చెప్పుల వద్ద కాపలాగా కూర్చొంది.రాత్రి మొత్తం తన యజమాని చెప్పుల వద్దనే కాపలా కాస్తూ కూర్చొంది కుక్క. తన యజమాని ఇంకెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంది. అటువైపు వెళ్తున్న వాళ్లను చూసి కుక్క మొరగడం, ఆ కుక్క చెప్పుల వద్ద చాలాసేపటి నుంచి కూర్చొని ఉండటం చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

woman died at bridge her pet dog waiting video viral

woman died at bridge her pet dog waiting video viral

Viral Video : రాత్రి మొత్తం అక్కడే కాపలా కాచిన కుక్క

దీంతో పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా.. ఆ కుక్క యజమాని అయిన మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుక్కను చూసి అటువైపు వెళ్లే వాళ్లు అయ్యో పాపం.. అంటున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది