Viral Video : సెల్ ఫోన్‌లో మాట్లాడొద్దు అని తల్లిదండ్రులు తిట్టడంతో పెద్ద జలపాతంలోకి దూకిన యువతి.. ఆ తర్వాత ఏమైందంటే?
Viral Video : ఈరోజుల్లో సెల్ ఫోన్ వాడకుండా ఎవ్వరూ ఉండరు. పిల్లలే ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఇక.. పెద్దవాళ్లు ఉంటారా? సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ కు బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఫోన్ యూసేజ్ కూడా పెరిగింది. యూత్ అయితే ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. 24 గంటలు ఫోన్ లోనే గడుపుతున్నారు. చదువు, కెరీర్ మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడూ సెల్ ఫోన్ తోనే టైమ్ పాస్ చేస్తే వాళ్లను ఏమనాలి.. వాళ్ల పేరెంట్స్ కూడా ఏదో ఒక మాట అంటారు. ఏం పనిలేదా ఎప్పుడూ ఫోన్ లో ఉండటమేనా అని అంటారు. దానికి కొందరు ఫీల్ అయిపోయి.. నన్ను ఇంత మాట అంటావా అని అఘాయిత్యాలు చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం.
అలాంటి ఘటనే ఇది. ఓ యువతి.. తన తల్లిదండ్రులు తిట్టారని.. సెల్ ఫోన్ వాడొద్దు అన్నారని ఏకంగా ఓ జలపాతం దగ్గరికి వెళ్లి దూకేసింది. అక్కడే ఉన్న పర్యాటకులు వద్దు వద్దు అంటూ వారిస్తున్నా వినకుండా ఆ యువతి పైనుంచి దూకేసింది. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లో చోటు చేసుకుంది.సెల్ ఫోన్ తోనే అక్కడికి వచ్చిన యువతి.. సెల్ ఫోన్ ను చేతుల్లోనే పట్టుకొని నీటిలోకి దూకింది. ఆ తర్వాత ఏమైందో కానీ.. నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది యువతి. తన చేతుల్లో సెల్ ఫోన్ కూడా అలాగే పట్టుకొని బయటికి రావడం విశేషం. ఈ ఘటనను మొత్తం అక్కడున్న వాళ్లు తమ వీడియోల్లో రికార్డు చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
Viral Video : చివరకు క్షేమంగా బయటపడ్డ యువతి
వార్నీ.. ప్రాణాలు పోతున్నా కూడా సెల్ ఫోన్ ను మాత్రం వదలకుండా ఆ యువతి.. సెల్ ఫోన్ కోసమే ఈదుకుంటూ బయటికి వచ్చినట్టుగా ఉంది. సెల్ ఫోన్ అంటే ఎంత ప్రేమ నీకు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.
సెల్ ఫోన్ వాడొద్దు అంటే జలపాతంలోకి దూకిన యువతి
చత్తీస్ఘడ్ – సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్న ఓ యువతిని తల్లి తండ్రులు తిడితే జలపాతంలోకి దూకింది.
చివరకు నీటిలో ఈదుకుంటూ సెల్ ఫోన్తో క్షేమంగా బయటకు వచ్చింది. pic.twitter.com/A9npZ9nWUA
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2023