Ycp mla raja : వైసీపీ ఎమ్మెల్యే రాజా సవాల్.. అదే జరిగితే నేను రాజీనామా చేస్తా..!
Ycp mla raja : వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల వర్వం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా తుని ఎమ్మెల్యే మాజీ మంత్రికి సవాల్ విసిరారు. నువ్వు చెప్పింది జరిగితే నేను రాజీనామా చేస్తానన్నారు.తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా మాజీ మంత్రి యనమలకు మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తునిలో మాజీ మంత్రి యనమల తెలుగుదేశం పార్టీ గౌరవసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తుని నుంచి టీడీపీ 10 వేల మెజారిటీతో గెలుస్తుందని కార్యకర్తలతో అన్నారు. అయితే, యనమల కామెంట్స్‌పై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో తనకు 15 వేల కంటే తక్కువ ఓట్ల మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కౌంటర్ ఇచ్చారు. తనపై యనమల గెలుపు సంగతి అలా ఉంచితే తనకు 15వేలు మెజార్టీ రాకుండా చూసుకోవాలని సవాల్ విసిరారు.

jagan following same formula again
కాగా, ఇటీవల తుని నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని చోట్లా వైఎస్సార్ పర్టీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. తుని నియోజకవర్గంలో 64 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కటి మాత్రమే గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షమ పథకాలే పార్టీని వరుసగా గెలుపిస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు.