Alla Ramakrishna Reddy – Chandrababu : చంద్రబాబును కలిసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి? మంగళగిరి నుంచి టికెట్ రానుందా?
ప్రధానాంశాలు:
ఆర్కే టీడీపీలో చేరుతారా?
ఆర్కే టీడీపీలో చేరితే మంగళగిరి నుంచి పోటీ చేస్తారా?
నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?
Alla Ramakrishna Reddy – Chandrababu : 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. 2019 ఎన్నికలు 175 నియోజకవర్గాలకు జరిగినా.. అసలు రాజకీయం మాత్రం మంగళగిరిలోనే జరిగింది. ఎందుకంటే.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కీలక నేతగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం అది. అందులోనూ చంద్రబాబు కొడుకు. దీంతో మంగళగిరిలో రాజకీయాలు చాలా టర్న్ తీసుకున్నాయి. ఎలాగైనా నారా లోకేష్ ను గెలిపించాలన్న కసిలో చంద్రబాబు ఉన్నారు. అందుకే.. టీడీపీ కీలక నేతలు అందరినీ మంగళగిరి పంపించారు. అక్కడే మకాం వేశారు. ఇక.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్లకే మరోసారి టికెట్ ఇచ్చారు జగన్. దీంతో అక్కడ ఎన్నిక కాస్త ఇంకా టఫ్ గా మారింది. అందుకే ఆ నియోజకవర్గం మీదనే అందరి చూపు పడింది.
నారా లోకేష్ గెలుపు మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రత్యక్ష రాజకీయాల్లో నారా లోకేష్ తొలి సారి అక్కడి నుంచే పోటీ చేశారు. నిజానికి అప్పుడు నారా లోకేష్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చివరి క్షణంలో నారా లోకేష్ ఓడిపోవాల్సి వచ్చింది. జగన్, ఆళ్ల వ్యూహాల ముందు నారా లోకేష్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే.. అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరికి వచ్చిన జగన్.. ఆళ్లను గెలిపిస్తే మంత్రిని చేస్తానని అన్నారు. కానీ.. గెలిచిన తర్వాత మాత్రం ఆళ్లకు మంత్రి పదవి రాలేదు. రెండో మంత్రి వర్గ విస్తరణలోనూ ఆళ్లకు అవకాశం రాలేదు. అలాగే.. నియోజకవర్గంలో వైసీపీ హైకమాండ్ ప్రవర్తించే తీరుపై ఆయనకు చిరాకు వచ్చింది. అందుకే పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
Alla Ramakrishna Reddy – Chandrababu : కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న ఆర్కే
అయితే.. ఆళ్ల తొలి నుంచి కాంగ్రెస్ వాది. ఆయన తొలి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. వైఎస్సార్ తర్వాత ఆయన కొడుకు పెట్టిన పార్టీ అని చెప్పి వైసీపీలో చేరినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీలో కాంగ్రెస్ కు ఇప్పుడు అంతగా పరిస్థితులు బాగా లేవు. అందుకే.. ఆయన టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.