Ys sharmila : పలచబడుతున్న సభలు.. షర్మిళ అంత బోర్ కొట్టిస్తుందా?
Ys sharmila : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ దారుణమైన కామెంట్స్ చేస్తుంది. ముఖ్యంగా తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ని కూడా చీల్చి చెండాడుతుంది. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఎన్నికల సమయంలో సిద్దం పేరుతో బయటకు వస్తున్నారన్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా?’’ అని షర్మిల నిలదీశారు. సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాదర్బార్ ఉండేదని , కాని ఇప్పుడు ఆయన వారసుడి పాలనలో అ ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని విమర్శించారు. జగన్‌పై రాయి దాడి జరిగినప్పుడు పెద్దగా సానుభూతి చూపించలేదు.
Ys sharmila : షర్మిళ ట్రాక్ తప్పిందా..
కడప జిల్లా నుంచి వైఎస్ షర్మిల న్యాయయాత్ర పేరిట ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆమె పర్యటనలు సాగుతున్నాయి.. ఎన్నికల ప్రచారంలో జగన్ ను నేరుగా లక్ష్యంగా చేసుకుని ఆమె చేస్తున్న ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కాకపోతే ఆమె వివేకానంద రెడ్డి హత్యను ఎక్కువగా మాట్లాడుతుండడం జనాలకి నచ్చడం లేదు. కొత్త సంగతులు.. కొత్త విషయాలు ఎక్కడా ప్రస్తావించడం లేదు. హోదా గురించి పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు, జగన్‌లు బీజేపీ తొత్తులని, ఈ రెండు పార్టీ లకూ ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ఆమె రికార్డ్ వేసినట్టు చెబుతుండడంతో సభలకి వచ్చిన వారు ఎక్కువ సేపు ఉండడం లేదు.
సభలన్నీ కూడా ఐదు పది నిమిషాలలో పలచబడిపోతున్నాయి. దీంతో జనాలను పోగు చేయలేక నాయకులు తలపట్టుకుంటున్నారు. అయితే షర్మిళ మొన్నటివరకు జగన్‌ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. కాని ఈ మధ్య తగ్గించింది. మరీ ఎక్కువగా ఆయనని విమర్శిస్తే సానుభూతి పెరుగుతుందని ఎవరైన చెప్పారేమో కాని చంద్రబాబు, మోదీలపై ఫోకస్ చేస్తూ వారిని విమర్శిస్తుంది. ఎలక్షన్స్ సమయం చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో ఓటు బ్యాంకును ప్రభావితం చేసుకునేందుకు షర్మిళ పక్కా ప్లానింగ్‌తో ముందుకు పోవల్సిన అవసరం ఎంతైన ఉంది.