Anchor shyamala : భీమిలి నియోజకవర్గంలో యాంకర్ శ్యామల… వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారాలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anchor shyamala : భీమిలి నియోజకవర్గంలో యాంకర్ శ్యామల… వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారాలు…!

Anchor shyamala : ప్రస్తుతం రాజకీయాలలో సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ వారికి నచ్చిన రాజకీయ నాయకులకు మద్దతుగా నిలుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తరఫున హైపర్ ఆది డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా వారి పనులను పక్కన పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ కోసం పలుచోట్ల ప్రచారాలు చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్యామల మద్దతుగా నిలుస్తూ ప్రచారాలలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Anchor shyamala : భీమిలి నియోజకవర్గంలో యాంకర్ శ్యామల... వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారాలు...!

Anchor shyamala : ప్రస్తుతం రాజకీయాలలో సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొంటూ వారికి నచ్చిన రాజకీయ నాయకులకు మద్దతుగా నిలుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తరఫున హైపర్ ఆది డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా వారి పనులను పక్కన పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ కోసం పలుచోట్ల ప్రచారాలు చేస్తున్నారు. ఇక వైసీపీ తరఫున టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్యామల మద్దతుగా నిలుస్తూ ప్రచారాలలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల శ్యామల భీమిలిలోని వైయస్ఆర్ కాలనీలో ప్రచారాలు చేపట్టారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జగనన్నను గెలిపించడానికి మేము సిద్ధం అంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు.

Anchor shyamala : మీడియాతో ముచ్చటించిన యాంకర్ శ్యామల…

ఇక ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారి పై మీకు ఉన్న అభిమానం మిమ్మల్ని ఇలా చూస్తేనే అర్థమయిపోతుంది. ఇక ఇతర పార్టీ మీటింగ్స్ చూసినట్లయితే అరుచుకుంటూ బూతులతో జరుగుతుంటే వైసీపీ పార్టీ మీటింగ్స్ , క్యాంపెయిన్లు చూసినట్లయితే ప్రేమ ఆప్యాయత జనాదరణతో నిండుతూ జరుగుతున్నాయని శ్యామల తెలియజేశారు. ఈ ఒక్క విషయం చాలు జగన్ ప్రభుత్వం ఏంటో తెలియడానికని తెలిపారు. ఇక వైయస్ఆర్ కాలనీలో నిలుచుని వైయస్ఆర్ పార్టీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదని ఎందుకంటే నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలిసే ఉంటుందని శ్యామల వ్యాఖ్యానించారు. ఇక అవంతి గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన పాలనలో ప్రజలకు మద్దతుగా నిలుస్తూ తగిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆయన గురించి నాకంటే బాగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ సంక్షేమం ఇలాగే సాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను గెలిపించాల్సిందిగా శ్యామల కోరారు. కావున 13వ తారీకు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో వైసీపీ పార్టీని గెలిపించాల్సిందిగా ఆమె కోరారు.

Anchor shyamala భీమిలి నియోజకవర్గంలో యాంకర్ శ్యామల వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారాలు

Anchor shyamala : భీమిలి నియోజకవర్గంలో యాంకర్ శ్యామల… వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారాలు…!

మీటింగ్ ముగిసిన అనంతరం మీడియాతో ముచ్చటించిన యాంకర్ శ్యామల ఆమె వైసీపీ పార్టీలోకి 2019లో చేరినట్లుగా తెలియజేశారు. తాను ఈ పార్టీలో చేరినప్పుడు మొట్ట మొదటిసారి క్యాంపెనింగ్ చేసింది అవంతి శ్రీనివాసరావు గారికేనని , ఇక ఆ సమయంలో భీమిలి నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మేము అవంతి గారి వైపే ఉంటామని అన్నారు. అన్నట్లుగానే గత ఎన్నికలలో వారిని గెలిపించారని శ్యామల తెలియజేశారు. అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందితేనే నాకు ఓటు వేయమని అడిగే ఒకే ఒక్క నాయకుడు జగనన్న మాత్రమేనని తెలియజేశారు. ఇక ఈ ఓట్లలో ఎమ్మెల్యేని ఎంపీలను ఎంచుకోవడం కాదని రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని యాంకర్ శ్యామల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సూచించారు. హామీలను ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటు వేస్తారా లేదా హామీలను , మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వాలకు ఓటు వేస్తారా కాస్త ఆలోచించి వేయండి అంటూ శ్యామల ఈ సందర్భంగా తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది