AP Cabinet : కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ కేబినెట్‌.. 12 అంశాల‌కి ఆమోద‌ముద్ర‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Cabinet : కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ కేబినెట్‌.. 12 అంశాల‌కి ఆమోద‌ముద్ర‌

AP Cabinet : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణాల‌మాలు చోటు చేసుకుంటున్నాయి. డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటి సారి పేపర్‌లెస్‌ ఈ-క్యాబినెట్‌ సమావేశం నిర్వహించింది. అజెండా మొదలు.. నోట్స్‌ వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేశారు. 2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన పేపర్‌లెస్ కేబినెట్ తరహా మరొక అధునాతన అప్లికేషన్ వినియోగించి మొదటి ఈ – కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధునాతన […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2024,5:00 pm

AP Cabinet : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణాల‌మాలు చోటు చేసుకుంటున్నాయి. డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటి సారి పేపర్‌లెస్‌ ఈ-క్యాబినెట్‌ సమావేశం నిర్వహించింది. అజెండా మొదలు.. నోట్స్‌ వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేశారు. 2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన పేపర్‌లెస్ కేబినెట్ తరహా మరొక అధునాతన అప్లికేషన్ వినియోగించి మొదటి ఈ – కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ ఫీచర్లతో కూడిన సమగ్ర అప్లికేషన్ ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ- కేబినెట్ నిర్వహించింది.

AP Cabinet : కొత్త నిర్ణ‌యాలు..

కేబినెట్ నిర్ణయాల అమలు తీరును మంత్రులు సమర్థంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా సంబంధిత సమాచారం ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సమాచారం గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కేబినెట్ నిర్ణయాల అమలు స్థితిని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పర్యవేక్షించడం, అంచనా వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. రాష్ట్రంలో జనావాస ప్రాంతాల్లో 14,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్ యాజమాన్యంలో, ప్రైవేట్ స్థలాలు మరియ భవనాల దగ్గరున్న సీసీ టీవీలు అనుసంధానం చేయడం ద్వాారా శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తుంది.

రియల్ టైమ్ గవర్నెన్స్ కు సాంకేతికతను జోడిస్తూ ఇన్సిడెంట్ మానిటరింగ్ సిస్టమ్, అలర్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి తగు చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని అన్నారు. డ్రోన్ల వినియోగం ద్వాారా కూడా రోడ్లపై గుంతలు గుర్తించడం, దోమల నియంత్రణ, అంటువ్యాధులు అరికట్టడం, తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో మందుల పిచికారీ చేసేందుకు దోహదపడుతుందన్నారు. కేబినెట్ అజెండా లోని 12 అంశాలు ఇవే 1. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, 2. సాగునీటి రైతు సంఘాల ఎన్నికలకు ఆమోదం, 3. రివర్స్ టెండర్ విధానం రద్దు, 4. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ, 5. 73 ఏళ్ళ జీవిత ఖైదు విడుదల ప్రతిపాదన, 6. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, 7. పట్టాదారు పాసుపుస్తకాలపై మార్పులు చేర్పులు, 8. కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటు, 9.సాధారణ పరిపాలన శాఖ (రాటిఫికేషన్) , 10. సాధారణ పరిపాలన శాఖ (ఉద్యోగాల సృష్టి), 11. ఇండస్ట్రీ అండ్ కామర్స్, 12. ఇసుక పాలసీ, 13. వికసిత్ ఆంధ్ర @ 2047

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది