YS Jagan : రాత్రికి రాత్రి వైఎస్ జగన్ డేరింగ్ నిర్ణయం – ఏపీ ప్రజలకి ఇంతకంటే హ్యాపీ న్యూస్ ఉంటుందా ?
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ పంథం వీడారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంథం నెగ్గించుకున్నారు. వీరిద్దరు కూడా ఢీ అంటే ఢీ అన్నట్లుగా నువ్వా నేనా అన్నట్లుగా న్యాయ పోరాటం చేశారు. హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు వీరి వివాదం వెళ్లింది. కాని వీరి వివాదంలో చివరకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కు సహకరించాల్సిందే అంటూ సుప్రీం కోర్టు సీఎం వైఎస్ జగన్ ను ఆదేశించింది. దాంతో జగన్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. మొన్నటి వరకు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సహకరించేది లేదు అంటూ కలెక్టర్లు.. రెవిన్యూ సిబ్బంది ఇతర సిబ్బంది అందరు కూడా భీష్మించుకు కూర్చున్నారు. నిమ్మగడ్డ రమేష్ కు వారంతా చుక్కలు చూపించారు. అయితే ఇకపై నిమ్మగడ్డ కు ప్రతి ఒక్కరు సహకరించాల్సిందే. అది జగన్ సూచన మేరకు అంటున్నారు.
వైఎస్ జగన్ భేటీతో విషయం క్లారిటీ : YS Jagan
ఉద్యోగ సంఘాల నాయకులు మరియు సొంత పార్టీ నాయకులు అందరిని కలిసిన వైఎస్ జగన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వెళ్లాలని , ఎన్నికలకు అంగీకరించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల విధులకు హాజరు కావాలని, జాగ్రత్తగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఈ సందర్బంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగన్ కనుక సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడే వారు. ప్రజల శ్రేయస్సు కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
నిమ్మగడ్డపై పోరాటం సాగుతుందన్న వైఎస్ జగన్
నిమ్మగడ్డ కు అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చిందని తాము పట్టించుకోకుండా ఉండము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించేలా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం వల్లే నిమ్మగడ్డ రమేష్ కు సహకరించాలని.. కాని ఆయన పై న్యాయ పోరాటం మాత్రం చేస్తూనే ఉంటామని ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాల నాయకులకు వైఎస్ జగన్ సూచించారు. నిమ్మగడ్డ ప్రభుత్వం కు చెసిన డ్యామేజీకి ఖచ్చితంగా బాధ్యతల నుండి తప్పుకుంటాడనే వాదన వినిపిస్తుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాస్త తగ్గినట్లుగా మాత్రం చెప్పుకోక తప్పదు.