AP Govt : మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Govt : మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Govt : మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం..!

AP Govt : ఏపీలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరాక అనేక సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతుండ‌డం మనం చూస్తున్నాం. పలు పథకాల పేర్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంంటుంది.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతోన్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టినట్టు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ మేరకు ట్వీట్ చేశారు. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా.. జగనన్న విద్యా కానుక పథకాన్ని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ అని పేరు పెట్టారు. అలాగే, జగనన్న గోరుముద్దను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్పు చేశారు. మన బడి – నాడు నేడును ‘మన బడి – మన భవిష్యత్తు’ అని, స్వేచ్ఛ పథకాన్ని ‘బాలికా రక్ష’ అని, జగనన్న ఆణిముత్యాలును ‘అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చినట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు.

AP Govt ప‌థ‌కాల పేర్లు మార్పు..

అయిదేళ్లపాటు గత ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిందని లోకేశ్ ఆరోపించారు. విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వం సంకల్పం అంటూ ఆయన తెలియ‌జేశారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నామన్నారు. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు పెట్టి, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నానని లోకేశ్ తెలిపారు.

AP Govt మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

AP Govt : మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల మార్పుపై ఉత్తర్వులు వెలువడ్డాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్చారు. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా.. వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా.. వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా మార్పు.. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా మార్చింది కొత్త ప్రభుత్వం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది