AP Govt : సంక్రాంతి కానుకగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం…!
ప్రధానాంశాలు:
AP Govt : సంక్రాంతి కానుకగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన AP ప్రభుత్వం...!
AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించింది. పండుగ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఎయిర్పోర్టులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాలు భర్తీ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని 100% అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రికార్డ్స్ సృష్టించారన్నారు. వైయస్సార్ హయాంలో ఏపీ అభివృద్ధి బాట పడితే ఇప్పుడు ఆయన తనయుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి సంక్షేమం జరిగిందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
అన్ని జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్లలో ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలను అందించాలని మూడు నెలల క్రితమే డీఈవోలు, ఆర్జెడీలకు పాఠశాల విద్యా కమిషన్ ఆదేశాలు జారీ చేసి వివరాలు సేకరించారు. నేరుగా నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రోఫారంలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే డిఎస్పి నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన మంచి ఊరట ఇచ్చిందని ఆయన అన్నారు.
ఇక ఏపీ ఎన్నికలు మరో వంద రోజుల్లో రానున్న క్రమంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి వరుస సంక్షేమ పథకాలను అందిస్తూ ఇప్పుడు నిరుద్యోగులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూ ఎన్నికలకు ఫేవర్ గా ఉండేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు వాటికి చెక్ పెడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పండుగ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయమన్నారు. తాము పెట్టిన హామీలన్నింటిని నెరవేరుస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా ప్రజలని ఆకర్షిస్తున్నారు.