YS Jagan : జగన్ పై దాడి కేసులో కీలక అప్ డేట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : జగన్ పై దాడి కేసులో కీలక అప్ డేట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : జగన్ పై దాడి కేసులో కీలక అప్ డేట్.. రేపటిలోగా కేసు ఛేదిస్తామన్న పోలీసులు..!

YS Jagan : విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తుండగా రాళ్ల దాడి చేయడం ఎంత సంచలనం రేపుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడిపై అటు ప్రతిపక్షాలు ఇటు అధికార వైసీపీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. వైసీపీ వాళ్లే చేయించి డ్రామా ఆడుతున్నారని కూటమి నేతలు అంటుంటే.. ప్రతిపక్షాలే దాడి చేయించాయని జగన్ సహా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో ఏపీలో రాళ్ల దాడి నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసలు దాడి ఎవరు చేయించారనేది ఇంకా తేలలేదు. దాంతో ఇప్పుడు పోలీసులపై ఒత్తిడి పెరిగిపోయింది.

YS Jagan : డీజీపీ పర్యవేక్షణలో..

బాధ్యులను పట్టుకుని చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. దాంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఏపీ నిగా వ్యవస్థ మీదనే ఈ దాడి అనుమానాలు పెంచుతోంది కాబట్టి డీజీపీ పర్యవేక్షణలో ఈ కేసును పోలీసులు ఛేదిస్తున్నారు. అయితే కేసులో పురోగతి లభించినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా కొంత మందిని విచారించారు. విచారించిన వ్యక్తుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు పోలీసులు. రాబట్టిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి విచారణ చేసినప్పుడు విజయవాడలోని సింగనగర్ లోని వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తే ఈ దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పూర్తి సమాచారం తెలిసేంత వరకు ఈ విషయాలు బటయకు పొక్కకుండా చూసుకుంటున్నారు. ఇది సీఎం మీద దాడి కేసు కాబట్టి మధ్యలోనే కొన్ని వివరాలు బయటకు వస్తే పార్టీలు గగ్గోలు పెడుతాయనే ఉద్దేశంతో పూర్తిగా సమాచారం తెలిసేంత వరకు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

YS Jagan జగన్ పై దాడి కేసులో కీలక అప్ డేట్

YS Jagan : జగన్ పై దాడి కేసులో కీలక అప్ డేట్..!

ఇందులో భాగంగా పోలీసులు ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోగా కేసును ఛేదిస్తామని తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బయటకు వెళ్లకుడా డీజీపీ ఆదేశాలు ఇచ్చారంట. దాంతో పోలీసులు అసలు ఏం చెబుతారా.. రాయి విసిరిన వ్యక్తి ఎందుకు దాడి చేశాడనేది బయటకు తెలుస్తుందా లేదా అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది