Asaduddin Owaisi : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓవైసీ ప్రభావం ఎంత.. జగన్ కు నష్టమా? లాభమా?
Asaduddin owaisi : ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ తమ పార్టీ ని ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ తో పాటు మహారాష్ట్ర, బిహార్ , బెంగాల్ ఎన్నికల్లో సత్తా చాటి వార్తల్లో నిలువగా.. ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫై ఫోకస్ పెట్టారు. ఏపీ లో మున్సిపల్ ఎన్నికల్లో అసదుద్దీన్ గట్టి ప్రయత్నమే చేశాడు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ..ఈ ఎన్నికల్లోనూ అదే విధంగా సత్తా చాటాలని చూస్తుంది. మరోపక్క తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో పోయిన పరువును నగర ఎన్నికల్లో నిలబెట్టుకోవాలని చూస్తుంది.
ఇలా రెండు పార్టీ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్ల ను ఆకట్టుకునే పనిలో ఉండగా.. ఇక ఇప్పుడు ఈ రెండు పార్టీ లకు దీటుగా ఏఐఎంఐఎం బరిలోకి దిగుతుంది. తమ పార్టీ ని సైతం ఏపీలో రాణించాలని సన్నాహాలు మొదలుపెట్టిన అసదుద్దీన్ విజయవాడలో రెండు డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టారు. ఇక రీసెంట్ గా కర్నూలు జిల్లా ఆదోని వెళ్లిన అసదుద్దీన్.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై వైసీపీ సర్కార్ ఫై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈద్గా కూల్చడం వెనుక స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి హస్తం ఉందని అనడమే కాదు ఆయన్ను చప్రాసీ అని సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ సర్కారు ముస్లింల ఆస్తులను లక్ష్యంగా చేసుకుందని.. శ్మశానాలను కూడా వదలడం లేదని ఆయన ఆరోపించారు. ఇక 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి ఓవైసీ మద్దతు ప్రకటించి , ఇప్పుడు ఆ పార్టీ పైనే నిప్పులు చెరుగుతున్నారు. దీనికి కారణం తెలంగాణ లో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతుండడమే అని అంటున్నారు. మరి షర్మిల పార్టీ పెట్టబోతున్నందుకు ఒవైసి ఏపీ ని టార్గెట్ చేస్తున్నాడా.. లేక మరో కారణం ఏమైనా ఉందా అనేది తెలియాలి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం ఎంత వరకు చూపిస్తుంది ఆయన వల్ల వైఎస్ జగన్ కు నష్టమా లాభమా అనే విషయం మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.