Avinash Reddy : అవినాష్ రెడ్డి తల్లి గురించి డాక్టర్ల సంచలన ప్రకటన..!
Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం బాగోలేదు అనే విషయం తెలుసు కదా. తన తల్లి ఆరోగ్యం బాగాలేకనే అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణకు కూడా హాజరు కాలేదు. దానిపై ప్రతిపక్షాలు చేయాల్సిన రాద్ధాంతం చేశాయి. తాజాగా అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో ట్రోపోనిన్ అనే వ్యాధి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అంటే.. అది గుండెపోటును తీసుకొచ్చే ప్రమాదం ఉంది. యాంజియోగ్రామ్ కూడా నిర్వహించగా.. ఆమెకు గుండెకు వెళ్లే రెండు రక్తనాళాలు బ్లాక్ అయినట్టు డాక్టర్లు గుర్తించారు. బీపీ కూడా లోగా ఉండటంతో.. ఆమెకు ఇప్పుడు ఎలాంటి ట్రీట్ మెంట్ అందించలేకపోతున్నారు వైద్యులు.ప్రస్తుతం అవినాష్ తల్లి ఐసీయూలోనే ఉన్నారు. మరికొన్ని రోజులు అవినాష్ తల్లిని ఆసుపత్రిలోనే ఉంచాలని డాక్టర్లు తెలిపారు. తల్లికి తోడుగా అవినాష్ అక్కడే ఉంటూ వైద్యులను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Avinash Reddy : ఐసీయూలోనే అవినాష్ తల్లి
తన తల్లికి అనారోగ్యం అని తెలియగానే తాను విచారణకు హాజరు కావడం లేదని సీబీఐకి తెలిపి హుటాహుటిన హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లారు అవినాష్. ఈనేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే.. ఈనెల 22న అవినాష్ ను సీబీఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని అధికారులు తెలిపారు. మరోసారి నోటీసులు జారీ చేయడంతో తన తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవినాష్ సీబీఐ విచారణకు వెళ్తారా? అనేది తెలియడం లేదు.