Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇక లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీటీడీ మాజీ ఛైర్మన్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇక లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీటీడీ మాజీ ఛైర్మన్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు వైవీ సుబ్బారెడ్డి. అయితే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ ఇన్ని రోజుల త‌ర్వాత చంద్ర‌బాబు ఈ ల‌డ్డు వ్య‌వ‌హారం తెర‌పైకి తీసుకురావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

Tirupati Laddu పెద్ద ప్లానే..!

జూన్ 12న కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కాగా, జూన్ 22న తిరుమల అక్రమాలపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. జూలై 7న నెయ్యి అక్రమాలు గుర్తించామని, జూలై 15న ఎన్డీడీబీ నివేదికలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లు తేలిందని చెప్తున్నారు. అయితే దాదాపు రెండు నెలల తర్వాత అంటే రెండు రోజుల క్రితం చంద్రబాబు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్టు తెర‌పైకి తీసుకురావ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తున్నాయి. రెండు నెల‌ల త‌ర్వాత ఈ మేట‌ర్ చంద్ర‌బాబు తెర‌పైకి తీసుకురావ‌డం వెన‌క పెద్ద స్కెచ్చే ఉంద‌ని అంటున్నారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది. త్వరలో పార్లమెంట్ లో ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈసారి జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలే రాష్ట్ర ఎన్నికల అజెండాగా మారడం, లేదా రాష్ట్ర ఎన్నికల అజెండాలో అంశాలు జాతీయ అజెండాకు చేరడం ఖాయం.

Tirupati Laddu ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

జగన్ దూకుడుకు కళ్లెం వేయాలంటే ఏదో ఒక కీలక అస్త్రం చంద్ర‌బాబుకి అవసరం కాబ‌ట్టి, ఇప్పుడు రాష్ట్రంలో అంశాల్ని సైతం జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందిన జగన్ ని అక్క‌డి పార్టీలు కూడా వ‌ద్ద‌నుకునేలా చంద్ర‌బాబు ల‌డ్డూ వ్య‌వ‌హారం ఇప్పుడు తెర‌పైకి తీసుకొచ్చార‌నే టాక్ న‌డుస్తుంది. చంద్రబాబు ఊహించినట్లుగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సైతం లడ్డూ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తోంది. మ‌రి దీనిని జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటారా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది