Bird Flu : బర్డ్ ఫ్లూ భయపెట్టిస్తుందా.. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి..!
ప్రధానాంశాలు:
Bird Flu : బర్డ్ ఫ్లూ భయపెట్టిస్తుందా.. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి..!
Bird Flu : ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. నేపథ్యంలో Andhra Pradesh Govt ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. గిరిజన గురుకులాల మెనూలో Chicken చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గురుకులాలు, ఈఎంఆర్ఎస్ స్కూళ్లకు చికెన్ నిలిపేశారు.

Bird Flu : బర్డ్ ఫ్లూ భయపెట్టిస్తుందా.. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి..!
Bird Flu ఈ నెంబర్స్‌కి కాల్ చేయండి..
చాలా మంది కోళ్లకు వచ్చిన ఆ వైరస్ మనకు ఎందుకు వస్తుంది లే అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ.. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని తినడం వల్ల,… మనకు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ప్రభుత్వాలు కనీసం రెండు వారాలు అయినా చికెన్ Chicken తినడం మానేయమని మొత్తుకుంటున్నాయి. అయినా..ప్రభుత్వం మాటలు వినిపించుకోకుండా Chicken చికెన్ తినేవాళ్లు లేకపోలేదు.
గత కొన్ని వారాలుగా అనేక చోట్ల లక్షలాది కోళ్లు చనిపోయాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ Bird Flu కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలను తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఫోన్: 0866 2472543, 94911 68699 నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ చేయాలని సూచించారు.