YS Jagan : దారుణమైన అన్యాయం చేసిన కేంద్రం.. కావాలనే జగన్ ని టార్గెట్ చేసారు?
YS Jagan : తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అది మూలధన పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించిన ప్రకటన. రాష్ట్రాలకు సంబంధించి.. మూలధన పెట్టుబడి ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. దేశంలోని 16 రాష్ట్రాలకు సుమారు రూ.56,415 కోట్ల మూలధన పెట్టుబడి మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. ఇవి మూలధన పెట్టుబడి కోసం విడుదల చేసినవి. మూలధన పెట్టుబడి అంటే పలు రంగాల అభివృద్ధికి వాటిని ఉపయోగించవచ్చు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, నీటి పారుదల, నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, కాజ్ వే, వంతెనల నిర్వహణ, రైల్వేల క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రాష్ట్రాల వాటా కింద ఆ నిధులను విడుదల చేసింది. అవి ఆయా రంగాల్లో నిర్మాణ పనుల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడనున్నాయి. ప్రతి సంవత్సరం మూల ధన వ్యయాలను ప్రోత్సహించడం కోసం కేంద్రం.. వార్షిక బడ్జెట్ లో ఈ నిధులను కేటాయిస్తుంది. తాజాగా 2023 – 24 కి సంబంధించిన సాయాన్ని విడుదల చేసింది.
YS Jagan : ఏపీకి ఎందుకు కేంద్రం నిధులు విడుదల చేయలేదు?
తాజాగా 16 రాష్ట్రాలకు నిధులను కేంద్రం విడుదల చేసింది. అందులో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఉంది కానీ.. ఏపీ మాత్రం లేదు. తెలంగాణకు రూ.2120 కోట్లను కేంద్ర విడుదల చేసింది. సౌత్ ఇండియాలో చూసుకుంటే తమిళనాడుకు రూ.4079 కోట్లు, కర్ణాటకకు రూ.3647 కోట్లు ప్రకటించింది. ఏపీతో పాటు అందులో మహారాష్ట్ర పేరు కూడా లేదు. కేరళ రాష్ట్రం పేరు కూడా లేదు. ఢిల్లీ, అస్సాం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల పేర్లు కూడా లేవు. దీనిపై కేంద్రం.. ఏపీ ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.