Chandra Babu Naidu : పబ్ లో డాన్సులు వేసిన రోజాపై చంద్రబాబు నాయుడు జబర్దస్త్ పంచులు… !!
ప్రధానాంశాలు:
Chandra Babu Naidu : పబ్ లో డాన్సులు వేసిన రోజాపై చంద్రబాబు నాయుడు జబర్దస్త్ పంచులు... !!
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా..కదలిరా పేరుతో బహిరంగ సభను ఇటీవల ఏర్పాటు చేశారు.ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన బహిరంగ సభకు చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, జిల్లా కోఆర్డినేటర్లు, పార్టీ ఇన్చార్జీలు పాల్గొన్నారు.అన్ని విధాల నష్టపోయిన ఏపీని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ గా ఉండాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందని కితాబు ఇచ్చారు. రైతులు బ్రతుకులు మారాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. మరో మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుంది అని అన్నారు. యువతకు ఉద్యోగ భృతి కల్పిస్తామని, భవిష్యత్తుకు నేను గ్యారెంటీ ఇస్తున్న అని యువతను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని యువతను ప్రపంచంలో నెంబర్ వన్ గా మారుస్తానని చెప్పారు.
ఇక వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో సమర్థవంతమైన మంత్రులు లేరని ఎద్దేవా చేశారు. క్లబ్బులో డాన్సులు వేసే రోజా మహిళా మంత్రి అని ఎద్దేవా చేశారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎమ్మెల్యేలను నమ్మటం లేదని, అందుకే వాళ్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా తీసేసారని, దీంతో ఎమ్మెల్యేలంతా పారిపోతున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజలు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదని, ఆయన మాత్రం ఎమ్మెల్యేలను నమ్మడం లేదని అన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిత్యవసర ధరలు పెరిగిపోయాయి అని చెప్పారుష టమాటాకు, పొటాటో తేడా తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ లో డెవలప్ చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేది కాదని అన్నారు. రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించాడని అన్నారు..తాము అధికారంలోకి రాగానే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దిగజారిందని చంద్రబాబు మండిపడ్డారు. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడించారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.