Chandrababu : బాబు బ‌హు బాగు.. వ‌రుస సెల‌వుల‌ని ఏం చేశాడంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : బాబు బ‌హు బాగు.. వ‌రుస సెల‌వుల‌ని ఏం చేశాడంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : బాబు బ‌హు బాగు.. వ‌రుస సెల‌వుల‌ని ఏం చేశాడంటే...!

Chandrababu : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కి అన్ని స‌కాలంలో అందుతున్నాయి. ముఖ్యంగా పించన్ల విష‌యంలో బాబు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంది. అయితే రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు. బ్యాంకులకు కూడా సెలవు దినాలు. రంజాన్ కూడా రావ‌డంతో వ‌రుస సెల‌వులు వ‌చ్చాయి. ఏప్రిల్ ఒకటిన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండడం.. వరుసగా రెండు రోజులు బ్యాంకుకు సెలవులు కావడంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu బాబు బ‌హు బాగు వ‌రుస సెల‌వుల‌ని ఏం చేశాడంటే

Chandrababu : బాబు బ‌హు బాగు.. వ‌రుస సెల‌వుల‌ని ఏం చేశాడంటే…!

Chandrababu వారిలో ఆనందం నింపారుగా..

29 శనివారం పింఛన్ మొత్తాలను సచివాలయ ఉద్యోగులకు అందించిన‌ట్టు తెలుస్తుంది. ముందుగానే బ్యాంకులకు జమ చేయడంతో ఏప్రిల్ ఒకటి మంగళవారం ఆ నగదును పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడువేల రూపాయలు ఉన్న పింఛన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచారు. పెంచిన మొత్తాన్ని మూడు నెలల పాటు వర్తింపజేసి పాత బకాయిలను సైతం అందించారు.

ప్రతి నెల ఒకటో తేదీన సెలవు దినాలు అయితే ఆ ముందు రోజే పింఛన్ అందించి లబ్ధిదారులకు పించ‌ను అందిస్తుంది కూట‌మి ప్ర‌భుత్వం. దివ్యాంగుల‌ పింఛన్ల విషయంలో మొన్న ఆ మధ్యన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్లు అందుకునేందుకు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది