YS Jagan : ఈ మధ్య కాలంలో జగన్ కి ఎన్నడూ లేని బిగ్ గుడ్ న్యూస్ !
YS Jagan : ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇంతలా చేయడం లేదు. అంత సాయం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. కేవలం ఉద్యోగుల జీతాల కోసం ప్రతి సంవత్సరం రూ.83 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కాకముందు సీఎం జగన్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను జగన్ నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు.
ఏదో ఎన్నికల కోసం అల్లా టప్పా నిర్ణయాలు తీసుకోవడం వైసీపీకి తెలియదని.. ఉద్యోగుల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యం అని ధర్మాన ప్రసాద రావు అన్నారు. అందుకే.. ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలిగేలా.. సీపీఎస్ బదులు జీపీఎస్ ను తీసుకొచ్చామని, వాళ్ల జీవన ప్రమాణాలను కాపాడామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగుల కోసం ఇంత చేస్తుంది కాబట్టి ప్రభుత్వం చేసే మంచిని ఉద్యోగులు గొంతు విప్పి చెప్పాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి తెలిపారు.
YS Jagan : ఉద్యోగులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలి
వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ఇవ్వాలి. అండగా ఉండాలి. అప్పుడు మరిన్ని మార్పులు సాధ్యం అవుతాయి అని మంత్రి స్పష్టం చేశారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే.. మరిన్ని పాలనా పరమైన సంస్కరణలను తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అంటే.. మంత్రి ధర్మాన డైరెక్ట్ గానే వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెబుతున్నారా? మరి.. మంత్రి పిలుపును ఉద్యోగులు ఎలా చూసుకుంటాయో వేచి చూడాల్సిందే.