Weather Report : అగ్గి లాంటి వేసవిలో చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ..!
ప్రధానాంశాలు:
Weather Report : అగ్గి లాంటి వేసవిలో చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ..!
Weather Report : ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్తే మాడిపోయేలా ఉన్నారు జనాలు. అంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటిందంటే చాలు.. ఎండలు మండిపోతున్నాయి. ఇంతగా వేసవి ఎండలు కొడుతున్నాయి. వాస్తవానికి మార్చి నుంచే ఈ ఎండలు ఇలా కొడుతున్నాయి. కానీ అప్పుడు మరీ ఇంత తీవ్రత లేదు. కానీ ఇప్పుడు ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఎండ వేడికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో ఇంకెలా ఉంటుందో అని భయపడుతున్నారు.
Weather Report : ఆ జిల్లాలో ఎండలు ఎక్కువ..
ఏపీలో చాలా చోట్ల విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులతో జనాలు అస్తవ్యస్తం అవుతున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అటు కోస్తాంధ్ర జిల్లాలో భానుడు ఉగ్రరూపం బయట పెడుతున్నాడు. దాంతో అక్కడ ఓ రేంజ్ లో ఎండలు కురుస్తున్నాయి.ఈనెల ఐదోతేదీన నంద్యాలలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 43.5 డిగ్రీలు, అనంతపురంలో 43.1 డిగ్రీలు, తిరుపతిలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీన్ని బట్టి ఎండ తీవ్రత ఎంతగా ఉందో చెప్పుకోవచ్చు అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇంతగా ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని చల్లని కబురు చెప్పింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఏపీ మొత్తంగా వర్షాలు ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే వర్షాలు కురిసినా ఎండ తీవ్రతమో తగ్గుముఖం ఉండకపోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఎండలు విపరీతంగా కొడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా ఎండలు ముదురుతాయని చెబుతున్నారు.
కాబట్టి అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బాడీ డీహైడ్రేట్ కు గురి కాకుండా ప్రతి అరగంటకు ఒకసారి నీరు తాగాలని చెబుతున్నారు.