Rains : రెయిన్ అల‌ర్ట్.. మ‌రో ఐదు రోజుల పాటు వ‌ర్షాలే వ‌ర్షాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rains : రెయిన్ అల‌ర్ట్.. మ‌రో ఐదు రోజుల పాటు వ‌ర్షాలే వ‌ర్షాలు

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2025,4:00 pm

Rains : సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. కాని ఈ సారి ఈ రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళా తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతపవనాలకు వాతావరణ పరిస్థితుల అనుకూలంగా ఉండడంతో అవి చురుగ్గా కదులుతున్నాయని దీంతో వ‌ర్షాలు భారీగానే ప‌డ‌నున్నాయ‌ని అంటున్నారు.

Rains : వ‌ర్షాలే వ‌ర్షాలు..

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

Rains రెయిన్ అల‌ర్ట్ మ‌రో ఐదు రోజుల పాటు వ‌ర్షాలే వ‌ర్షాలు

Rains : రెయిన్ అల‌ర్ట్.. మ‌రో ఐదు రోజుల పాటు వ‌ర్షాలే వ‌ర్షాలు

ఉత్తర కర్ణాటక-గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఉన్న ఉపరితల ఆవర్తం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంతాలు, పరిసరాలను ఆనుకొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది