Janasena Glass Symbol : గ్లాస్ గుర్తును ప్రీ లిస్ట్ లో ఈసీ చేర్చ‌డంతో జ‌న‌సేన‌కు భారీ న‌ష్ట‌మేనా.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janasena Glass Symbol : గ్లాస్ గుర్తును ప్రీ లిస్ట్ లో ఈసీ చేర్చ‌డంతో జ‌న‌సేన‌కు భారీ న‌ష్ట‌మేనా.?

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2024,1:15 pm

Janasena Glass Symbol  : రానున్న 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా లిస్ట్ ఆఫ్ పార్టీస్ ని విడుదల చేయడం జరిగింది. అంటే గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు అన్నమాట. అయితే ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ మరియు వైసీపీ పార్టీలు మాత్రమే గుర్తించబడ్డాయి. అంటే ఇక్కడ జనసేన పార్టీకి చోటు దక్కలేదు. ఇక తెలంగాణలో ఎంఐఎం మరియు బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే ప్రాంతీయ పార్టీలుగా గుర్తించబడ్డాయి. అయితే ఎన్నికల సంఘం ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. అయితే వాస్తవానికి ప్రాంతీయ పార్టీలను గుర్తించాలంటే ఆ ప్రాంతంలో ఆ పార్టీకి కనీసం 15% కంటే ఎక్కువ ఓట్ బ్యాంకు కలిగి ఉండాలి. అప్పుడే ఆ పార్టీ ని ప్రాంతీయ పార్టీగా గుర్తించి వారికి కావలసిన సింబల్స్ ను ఇస్తారు.అలా లేని పక్షంలో వారికి ఇచ్చిన ఆ సింబల్ ను ఫ్రీ లిస్ట్ కింద పెడతారు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అదే జరిగింది.

Janasena Glass Symbol  : మిగిలిన చోట గ్లాస్ సింబల్ ఉపయోగించుకొవ‌చ్చు

అయితే ఈ ఫ్రీ లిస్టులో ఉన్న సింబల్స్ ను ఎవరైనా సరే ఉపయోగించుకొని ఎక్కడి నుండి అయినా సరే పోటీ చేయవచ్చు. అంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాలలో తప్ప మిగిలిన చోట ఈ గ్లాస్ సింబల్ ఉపయోగించుకొని ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ అనేది జనసేన పార్టీకి మాత్రమే కాకుండా మొత్తం కూటమికి పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా గుర్తించిని లిస్టులో లేదు కానీ రిజిస్టర్ అయిన పార్టీ లిస్టులో ఉంది. అయితే గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీకి 7% మాత్రమే ఓటు బ్యాంక్ ఉండడం అలాగే ఒక్కరంటే ఓకే ఒక్కరు ఎమ్మెల్యేగా గెలవడం వలన జనసేన పార్టీని ఎన్నికల సంఘం ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. అయితే దీనివలన ఇప్పుడు కూటమికి కలిగే నష్టం ఏంటి అంటే….. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం తీసుకుందాం. ఇక్కడ కూటమి నుండి జనసేన పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి గ్లాస్ గుర్తు కనిపిస్తుంది.

టీడీపీకి సంబంధించిన సైకిల్ గుర్తు బీజేపీ కి సంబంధించిన కమలం గుర్తు ఇక్కడ కనిపించదు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏలూరు నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ కూటమి నుండి టీడీపీ పోటీ చేస్తుండడంతో పోలింగ్ బూత్ లో సైకిల్ గుర్తు కనిపిస్తుంది. అంటే జనసేన గ్లాస్ గుర్తు కాని కమలం గుర్తుకాని ఇక్కడ కనిపించదు. కానీ గ్లాస్ గుర్తును ఫ్రీ లిస్టులో చేర్చడం వలన ఆ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైనా సరే ఆ గ్లాస్ గుర్తును ఉపయోగించి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. తద్వారా ఇక్కడ కూటమి యొక్క ఓట్లు చీలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంత ఎందుకు అధికార పార్టీ వైసీపీ కూడా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టి గ్లాస్ గుర్తు ద్వారా పోటీచేయని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయం తెలియని కొందరు సామాజిక వర్గ నేతలు అది జనసేన పార్టీ గుర్తు అనుకోని దానికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. తద్వారా కూటమి యొక్క ఓట్లు అనేవి చీలిక పడుతుంది. మరి దీనిని కూటమి ఏ విధంగా ఎదురుకుంటుందో వేచి చూడాల్సిన విషయం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది