Amaravati : అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు
amaravati : నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా అదనపు భూసేకరణ, నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు మంత్రివర్గ ఆమోదం పొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అమరావతిలో నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో, దీనికి సంబంధించిన పలు అంశాలు ఈ సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకుంటాయని అంచనా.

Amaravati : అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయాలు
amaravati నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
గతంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదించిన నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని సమాచారం. ఇప్పటికే అమరావతిలో నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సులు ఇవ్వాల్సిన అంశంపై చర్చ జరగనుంది. ప్రపంచ బ్యాంకు నుండి ఇప్పటికే రూ. 15,000 కోట్ల రుణం మంజూరు కావడంతో, అమరావతిలో 90 పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. ఇందులో మొదటి దశలో 73 పనులకు పరిపాలనపరమైన ఆమోదం లభించింది. ఈ పనుల కోసం సుమారు రూ. 24,274 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
మొత్తంగా సీఆర్డీఏ గతంలో రూ. 45,249 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చింది. ఇందులో అసెంబ్లీ భవనానికి రూ. 765 కోట్లు, హైకోర్టు భవనానికి రూ. 1,048 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. అలాగే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి రూ. 4,665 కోట్లు, రహదారుల టెండర్లకు రూ. 9,699 కోట్లు, ఇతర రోడ్లకు రూ. 7,794 కోట్లు వ్యయం చేయనున్నారు. సీఆర్డీఏ 45వ సమావేశంలో ఆమోదించిన పలు అంశాలకు మంత్రివర్గ ఆమోదం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జరీబు భూముల రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లు, హైకోర్టు, శాసనసభ భవనాలకు సంబంధించిన టెండర్లు, రూ. 473 కోట్ల మంజూరు వంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశముంది.