Kodali Nani VS YS Sharmila : ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోయిన కొడాలి నాని VS వైయస్ షర్మిల..!
ప్రధానాంశాలు:
Kodali Nani VS YS Sharmila : ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోయిన కొడాలి నాని VS వైయస్ షర్మిల..!
Kodali Nani VS YS Sharmila : ఏపీలో శాసనసభ ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది.మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి.ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైఎస్ఆర్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని అధికార పార్టీపై దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవులు చేపట్టి వరుసగా యాత్రలు చేస్తూ రోడ్ షో నిర్వహిస్తున్నారు. తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ పై కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక వైఎస్ఆర్ సీపీ మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి అందరికీ తెలిసిందే. మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని మరోసారి ప్రతిపక్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికలకు శాశ్వతంగా చంద్రముఖి చంద్రగ్రహణం లాంటివి ఏమీ ఉండవని, చంద్రబాబు కాదు చంద్రముఖి అని, రక్తాన్ని పీల్చే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉండడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ, అమిత్ షాలను అపాయింట్మెంట్ అడిగి అడిగి ఊరుకున్నాడు. కానీ టీడీపీ వాళ్ళు మా చంద్రబాబును రా బాబు రా బాబు అని పిలుస్తున్నారని వార్తలు వేస్తారు అని వ్యంగంగా అన్నారు. అవసరమైతే చంద్రబాబు ఎవరు కాలైనా పట్టుకుంటాడు, అబద్ధాలు ఆడడానికి వెనకాడడు, మోసం చేయడానికి వెనుకాడడు, నాయి బ్రాహ్మణులను ఎస్సీలో కలుపుతానని, కాపులను బీసీ లో కలుపుతానని కుల మతాలను మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడని అందుకే ప్రజలంతా జాగ్రత్తగా గమనించి అమూల్యమైన ఓటును వైయస్ జగన్మోహన్ రెడ్డికి వేయాలని సూచించారు. ఇక తాజాగా వైయస్ షర్మిల మరోసారి వైసీపీకి ప్రభుత్వం పై మండిపడ్డారు. ఒకటి కాదు మూడు రాజధానులు కావాలని సీఎం వైఎస్ జగన్ అన్నారని, ఇప్పుడు రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వైఎస్ షర్మిల అన్నారు. అని హామీలను కేంద్రం నెరవేర్చిందని వైఎస్ జగన్ అంటున్నారని వివరించారు.
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేయని వ్యాపారం అంటూ ఏమీ లేదని, ఇసుకను దోచుకున్నాడని, గుట్కాలను అమ్ముకున్నాడని, వేరే రాష్ట్రంలో మందు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడని, అతడు చేయని వ్యాపారం అంటూ ఏమీ లేదని, అతడు దాడిశెట్టి రాజా కాదు అనుభవించు రాజా అని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టినా ఎక్కడ అభివృద్ధి కనిపించలేదని విమర్శించారు. పదేళ్లలో పది కొత్త పరిశ్రమలు కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. వైయస్సార్ పాలన ప్రజల చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నట్లు వైయస్ షర్మిల వెల్లడించారు. వైయస్సార్ సంక్షేమ పాలనను ప్రజల గడప ముందుకు తీసుకు వస్తానంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్న ఆలోచించి ఓటు వేయండని ఓటు జీవితాలను మార్చే ఆయుధమని సూచించారు.