Lagadapati Rajagopal : మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న లగడపాటి..!!
తెలుగు రాజకీయాలలో లగడపాటి రాజగోపాల్ అందరికీ సుపరిచితుడే. అప్పట్లో రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంటులో పెపర్ స్ప్రే కొట్టి.. వార్తల్లో నిలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ రాణించారు. అయితే రాష్ట్ర విభజన జరిగే క్రమంలో లగడపాటి సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏపీని విభజించడంతో లగడపాటి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం జరిగింది.
ఆ తరువాత తన సంస్థలతో ఎన్నికల సమయంలో సర్వేలు చేయిస్తూ వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో లగడపాటి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సహచరుల నుండి అదే విధంగా అనుచరుల నుండి ఏపీలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేయాలని లగడపాటి పై ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఇటీవల విజయవాడలోని ఓ హోటల్ లో మద్దతుదారులతో భేటీ అయిన లగడపాటి.
మరోసారి విజయవాడ నుండి ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మీద చూసుకుంటే మరోసారి లగడపాటి రాజగోపాల్.. రాజకీయాల్లోకి రావటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.