Lagadapati Rajagopal : ఏపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న లగడపాటి రాజగోపాల్.. ఏ నియోజకవర్గమో తెలుసా?
ప్రధానాంశాలు:
మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్న లగడపాటి
లగడపాటి రాజకీయాల్లోకి వస్తే ఇక ఎంపీగా పోటీ
టీడీపీ నుంచి పోటీ చేయనున్నారా?
Lagadapati Rajagopal : లగడపాటి రాజగోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ లో లగడపాటి చేసిన రచ్చ అందరికీ తెలుసు. పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చేసి రచ్చ రచ్చ చేశారు. ఆ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ లగడపాటి రాజగోపాల్ అప్పట్లో పార్లమెంట్ లో హడావుడి సృష్టించారు. తెలంగాణ వస్తే ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని తెలిపారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. అనుకున్నట్టుగానే కొన్నేళ్ల పాటు లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా ఆయన మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అంటే మళ్లీ లగడపాటి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలో లగడపాటి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అంటే ఆయన టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అందుకే పలువురు నేతలు కూడా మళ్లీ యాక్టివ్ అయి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకే లగడపాటి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
Lagadapati Rajagopal : విజయవాడ నుంచే మళ్లీ పోటీ చేయబోతున్నారా?
ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం టీడీపీలో అంత యాక్టివ్ గా లేరు. దీంతో ఈసారి ఎంపీ టికెట్ ను టీడీపీ నుంచి వేరే వ్యక్తికి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తాను ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేస్తానని లగడపాటి అధిష్ఠానంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆయనకు కలిసి వచ్చిన విజయవాడ నుంచే మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. గుంటూరు, ఏలూరు నుంచి కూడా పోటీ చేసేందుకు ఓకే చెప్పినా.. తన రీఎంట్రీని విజయవాడ నుంచే పోటీ చేస్తానని తెలిపినట్టు సమాచారం. చూద్దాం మరి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే లగడపాటి గెలుస్తారో లేదో?