Lagadapati Rajagopal : లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీ? అక్కడి నుంచి బరిలోకి.. ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lagadapati Rajagopal : లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీ? అక్కడి నుంచి బరిలోకి.. ?

 Authored By sukanya | The Telugu News | Updated on :4 October 2021,6:30 pm

Lagadapati Rajagopal మాట మీద నిలబడతామని చెప్పే రాజకీయ నేతలెవరూ చేయని పని ఏదైనా ఉందంటే.. అది చెప్పిన మాట మీద నిలబడటమేనని విశ్లేషకులు చెబుతూ ఉంటారు.. మాజీ కాంగ్రెస్ ఎంపీగా సుపరిచితుడైన లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎపిసోడ్ లో వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా నడిచేది. సీమాంధ్ర నేతల దౌర్జన్యాలకు.. వారి అధిపత్యానికి నిలువుటద్దంలా లగడపాటి రాజగోపాల్ నిలిచేవారు.

lagadapati rajagopal Reentry in politics

lagadapati rajagopal Reentry in politics

తెలంగాణ వాదం తీవ్రంగా వినిపించే వేళ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశమే లేదని చెప్పటమే కాదు.. ఒకవేళ విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. లోక్ సభలో విభజన బిల్లు పెట్టిన వేళ.. తన మీద దాడికి యత్నించిన వారిపై పెప్పర్ స్ప్రే చేయటం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభలో పెప్పర్ స్ప్రే చేయటమా? అన్న షాక్ కు గురయ్యేలా చేశారు.

Lagadapati Rajagopal కేశినేని ప్లేస్ లో ..

ఇదిలా ఉంటే.. విభజన నేపథ్యంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన లగడపాటి రాజగోపాల్.. తాను చెప్పినట్లే రాజకీయాల్ని సన్యసించి.. దూరంగా ఉండసాగారు. ఎప్పుడైనా ఒకసారి.. అప్పుడప్పుడు మాత్రం రాజకీయ వేదికల మీద తళుక్కున మెరిసినా.. అదంతా కూడా గెస్టు రోల్ తప్పించి.. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన మాటను నిలబెట్టుకున్నారు. ఇన్నాళ్లు వార్తల్లో లేకుండా పోయిన లగడపాటి రాజగోపాల్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు.

lagadapati rajagopal Reentry in politics

lagadapati rajagopal Reentry in politics

దీనికి కారణం లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీ ఖాయమని.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసేది లేదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తేల్చి చెప్పటమే కాదు.. తన కుమార్తె కూడా పోటీకి దూరంగా ఉంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు బదులుగా లగడపాటి రాజగోపాల్ని తీసుకు రావాలన్న యోచనలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు.

Lagadapati Rajagopal త్వరలోనే రీ ఎంట్రీ టాక్..

దీనికి సంబంధించి ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నాయని.. అన్ని అనుకున్నట్లు జరిగితే.. లగడపాటి రీ ఎంట్రీ ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. రాజకీయ సన్యాసం అని చెప్పి మళ్లీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు ఎదుర్కోగలరా? అన్న ప్రశ్న కొందరి నోట వినిపిస్తోంది. చెప్పినట్లే.. కొంతకాలం రాజకీయాల్లో దూరంగా ఉన్న తర్వాతే మళ్లీ ఎన్నికల బరిలో నిలవటం తప్పేం కాదన్న సమర్థింపు వినిపిస్తోంది. మరెలాంటి నిర్జయాన్ని లగడపాటి రాజగోపాల్ తీసుకుంటారో కాలమే తేల్చాలి.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది