Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియ జైలుకి వెళ్ళిన సంఘటనలో భారీ ట్విస్ట్ !
Bhuma Akhila Priya : ప్రస్తుతం ఏపీ మొత్తం నంద్యాల జిల్లా వైపు చూస్తోంది. దానికి కారణం.. అక్కడి టీడీపీ రాజకీయాలు. అవును.. వేరే పార్టీల నేతల కొట్లాట అంటే అదీ కాదు. టీడీపీ పార్టీలోనే పలు వర్గాలుగా విడిపోయారు. అసలే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఈసారి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరోవైపు యువనేత నారా లోకేశ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తన యువగళం పాదయాత్ర కూడా నంద్యాలకు చేరుకుంది.ఈనేపథ్యంలో టీడీపీ పార్టీలో వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. మొత్తం నాలుగు గ్రూపులుగా విడిపోయారు నంద్యాల టీడీపీ నేతలు.
నలుగురు నేతలు.. తమ వర్గంతో సపరేట్ గా యువగళం పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈనేపథ్యంలో భూమా అఖిలప్రియ అనుచరులు.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే.నంద్యల టీడీపీకి అంతో ఇంతో మద్దతు ఇచ్చే జిల్లా. కాస్తో కూస్తో నంద్యాల నియోజకవర్గంలో ఉన్న బలం కాస్త ఇప్పుడు విభేదాల మూలంగా పోయిందనే చెప్పుకోవాలి. యువగళం పాదయాత్రలోనే టీడీపీ నేతలు దాడి చేసుకోవడంతో టీడీపీ కార్యకర్తల్లోనూ ఒకింత భయం నెలకొన్నది.
Bhuma Akhila Priya : రచ్చకెక్కిన టీడీపీ నేతల మధ్య విభేదాలు
ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో భూమా అఖిలప్రియను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నంద్యాల కోర్టులో హాజరుపరిచి.. 14 రోజుల పాటు ఆమెతో పాటు భార్గవరామ్, మోహన్, సాయినాథ్ లను రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె కర్నూలు మహిళా సబ్ జైలులో ఉంది. ఆళ్లగడ్డ నుంచి లేదా నంద్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి భావిస్తున్నారు. అందుకే.. ఆయనపై వేరే వర్గం దాడి చేసిందని అంటున్నారు. చూద్దాం మరి.. నంద్యాల రాజకీయాలు ఇంకెంత దూరం వెళ్తాయో?