Nara Lokesh : రెడ్ బుక్ తెరవకముందే ఢిల్లీలో జగన్ గగ్లోలు పెడుతున్నాడుగా.. లోకేష్ సెటైర్స్..!
ప్రధానాంశాలు:
Nara Lokesh : రెడ్ బుక్ తెరవకముందే ఢిల్లీలో జగన్ గగ్లోలు పెడుతున్నాడుగా.. లోకేష్ సెటైర్స్..!
Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఎంత రసవత్తరంగా మారుతుందో మనం చూస్తున్నాం. ఎన్నికల తర్వాత కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జగన్ అయితే ఢిల్లీ వెళ్లి మరి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాడు లోకేష్‌ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
Nara Lokesh జగన్‌పై లోకేష్ పంచ్‌లు..
అనంతరం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తన దగ్గర రెడ్ బుక్ ఉందని తానే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పానన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 ప్రెస్‌మీట్‌లు పెడితే.. 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ప్రెస్‌మీట్‌లు పెట్టారని తెలిపారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే, వాస్తవాలు మేం వివరిస్తాం కదా అని అన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. వైకాపా నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతులు తిట్టరు, జగన్ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచరని లోకేశ్ హామీయిచ్చారు.
”నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పా. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్ళిపోయాడు. రెడ్ బుక్‌కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడని లోకేశ్ . జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, జగన్ ..రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించారు.