Chandrababu Naidu : నిమ్మగడ్డ యూటర్న్‌కు కారణం ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్న చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : నిమ్మగడ్డ యూటర్న్‌కు కారణం ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్న చంద్రబాబు

 Authored By himanshi | The Telugu News | Updated on :16 February 2021,4:30 pm

Chandrababu Naidu : ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరిపి తీరుతాను అంటూ నిమ్మగడ్డ రమేష్ భీష్మించుకు కూర్చుంటే వైఎస్ జగన్‌ మాత్రం నో అన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు సహకరించేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. దాంతో ఏం చేయాలో పాలుపోక నిమ్మగడ్డ రమేష్‌ కోర్టుకు వెళ్లి మరీ ఆదేశాలు అనుమతులు తీసుకు వచ్చాడు. సుప్రీం కోర్టు తీర్పుతో చేసేది లేక జగన్‌ పంచాయితీ ఎన్నికల పంచాయితీకి ఫుల్‌ స్టాప్ పెట్టి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం అయ్యాడు. ఇలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్ వైకాపా వారిపై అనేక రకాలుగా నియమ నిబంధనలు పెట్టి వారిని ఎక్కడికి అక్కడ కట్టడి చేయడం జరిగింది. దాంతో వారు అంతా కూడా జుట్టు పీక్కున్నారు. ఏం చేయాలో పాలుపోక నిమ్మగడ్డ రమేష్‌ పై దాడికి కూడా వైకాపా నాయకులు ప్రయత్నించారు అంటూ ఆరోపణలు వచ్చాయి.

Nimmagadda ramesh not supporting tdp and chandra babu naidu

Nimmagadda ramesh not supporting tdp and chandra babu naidu

వైకాపాకు అంతగా వ్యతిరేకంగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్‌ అనూహ్యంగా జగన్‌ చెప్పినట్లుగా దేనికైనా సిద్దం అన్నట్లుగా తల ఊపుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నోరు వెళ్లబెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు మాట విన్న నిమ్మగడ్డ ఇప్పుడు ఉన్నట్లుండి సీఎం వైఎస్ జగన్‌ మాట వినడం వెనుక ఆంతర్యం ఏంటీ ఇద్దరి మద్య జరిగింది ఏంటీ ఎందుకు నిమ్మగడ్డ యూటర్న్‌ తీసుకున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈమద్య చంద్రబాబు నాయుడు ఫిర్యాదు ఇచ్చినా కూడా నిమ్మగడ్డ పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి వీరిద్దరి మద్య ఏదో విషయం లో చెడిందా అంటే అవును అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు.

Chandrababu Naidu :  నిమ్మగడ్డ అలా ఎందుకు చేశాడు

తెలుగు దేశం పార్టీతో పాటు ఇతర పార్టీ నాయకులు మున్సిపల్‌ మరియు పరిషత్‌ ఎన్నికలు ఎక్కడ ఆగిపోయాయో అక్కడ నుండి కాకుండా ఆరంభం నుండి పెట్టాలని కోరుకుంటున్నారు. కాని సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం ఖచ్చితంగా ఎన్నికల పక్రియ ఎక్కడ ఆగిందో మళ్లీ అక్కడ నుండి మొదలు పెట్టాలని కోరుకున్నాడు. సీఎం వైఎస్ జగన్ కోరుకున్న దాని ప్రకారమే నిమ్మగడ్డ రమేష్ నుండి ఎన్నికల ప్రకటన వచ్చింది. ఈ విషయంలో నిమ్మగడ్డ అలా ఎందుకు చేశాడు అనేది చంద్రబాబుకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడట.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది