Pawan Kalyan : ఎన్ని కష్టాలయ్యా పవన్ కళ్యాణ్ నీకు – అనడం ఎందుకు ఇబ్బంది ఎందుకు !
Pawan Kalyan : వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్న పొలిటికల్ కామెంట్స్ జనసేన పార్టీ గ్రాఫ్ పడిపోయెలా చేస్తున్నాయి. నోటికి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది తల.. తోక లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కొంపముంచుతున్నాయి. తాజాగా వారాహి రెండో దశ విజయ యాత్రలో ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. గ్రామాలలో మహిళల అక్రమ రవాణాలకు వాలంటీర్ల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకి చెప్పినట్లు రాష్ట్ర ప్రజలను హెచ్చరించమన్నట్లు చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ పరువు తీసేలా చేశాయి. ఒంటరి మరియు వితంతువు మహిళలను వాలంటీర్లు టార్గెట్ చేసి వారి సమాచారాన్ని.. అసాంఘిక శక్తులకు ఇస్తున్నట్లు పవన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వాలంటీర్లు పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించి రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది.
దీంతో ఆ మరుసటి రోజే అందరి వాలంటీర్లను అనటం లేదని ఎవరో కొంతమంది.. చేసిన తప్పుకు అందరూ మాట పడాల్సి వస్తుందని.. కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్లు పవన్ చేసిన వ్యాఖ్యలను చాలా తప్పు పట్టడం జరిగింది. ఈ క్రమంలో మీసేవ ఇంకా ఇతర విభాగాలలో తీసుకునే సమాచారమే తాము తీసుకుంటున్నట్లు చెప్పుకొస్తున్నారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వం సేకరించమన్న సమాచారాన్ని.. తాము సేకరిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ రకంగా సమాచారం క్షేత్రస్థాయిలో సేకరించకపోతే ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతాయని పవన్ ని ప్రశ్నిస్తున్నారు. సక్రమంగా పథకాలు ప్రజలకు అందించడం కోసం వివరాల సేకరణ మాత్రమే అని చెప్పుకొస్తున్నారు.
ఒకప్పుడు ఈ సేవ, మీ సేవలో… సమాచారం అందించినప్పుడు జరగని.. తప్పులు వాలంటీర్లు వచ్చాక ఎందుకు జరుగుతాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫెయిర్ అయ్యి జనసేన పార్టీ పరువు తీసేలా చేస్తున్నాయి అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడిన ఈ వాలంటీర్లు వ్యవస్థ పై పవన్ చేసిన కామెంట్స్ ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేసాయి. అసలు అనటం ఎందుకు ఇబ్బందులు ఈ రకంగా అనటం ఎందుకు ఇబ్బంది పడటం ఎందుకు అంటూ.. పవన్ కళ్యాణ్ కి తాజా పొలిటికల్ కష్టాలపై భారీ ఎత్తున సెటైర్లు పడుతున్నాయి.