Pawan Kalyan : హిందీ భాషపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : హిందీ భాషపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi language తన మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అధికార భాషా స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, హిందీని జాతీయ భాషగా తాను స్వాగతిస్తున్నానని ప్రకటించారు. భాషలు శరీరానికి శక్తిని ఇచ్చే జీవ భాషలని అభివర్ణిస్తూ, దేశంలోని ప్రతి భాషకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. “సరిహద్దులు దాటితే మన భాష హిందీ” అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Pawan Kalyan : హిందీ భాషపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!
Pawan Kalyan : హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే – పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ హిందీ భాష ప్రాముఖ్యతపై వివరంగా మాట్లాడారు. “ఇంగ్లిష్, ఉర్దూ, పర్షియన్ వంటి విదేశీ భాషలను అంగీకరించి, మన దేశంలో పుట్టిన హిందీ భాషను వ్యతిరేకించడం అవివేకం” అని స్పష్టం చేశారు. మాతృభాషను తల్లి సరిపోల్చితే, హిందీ భాష పెద్దమ్మ వంటిదని వ్యాఖ్యానించారు. “మన రాజ్య భాష హిందీని జాతీయ భాషగా స్వీకరిస్తాను. మనం ఏకం కావడానికి ఒకే భాష అవసరం. హిందీ అదే భాష” అని పేర్కొన్నారు.
అలాగే వ్యాపార, ఉద్యోగావకాశాలు మెరుగయ్యేందుకు హిందీ భాషను నేర్చుకోవడం అవసరమని పవన్ సూచించారు. దేశ వ్యాప్తంగా కమ్యూనికేషన్ సులభతరం కావాలంటే హిందీను ప్రాధాన్యంతో చూడాలని, హిందీని వ్యతిరేకించడం అంటే అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనని అన్నారు. “హిందీ నేర్చుకోవడం లో ఇబ్బంది ఏంటి?” అంటూ ప్రశ్నించిన పవన్ వ్యాఖ్యలు భాషాపై చర్చను మళ్లీ రాజేసే అవకాశముంది.