Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్.. మధ్యలో టీడీపీ..?
ప్రధానాంశాలు:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్.. మధ్యలో టీడీపీ..?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇటీవల కర్ణాటక వెళ్లి అక్కడ సీఎం సిద్ధారామయ్యతో కలిసి రాజకీయాల గురిచి ప్రస్తావించారు. ఐతే వాళ్లిద్దరు ఒకేచోట కలవడం పాలిటిక్స్ లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కర్ణాటక వెళ్లారు. అక్కడ నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చే ప్లానింగ్ తో అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ వచ్చారు. కాంగ్రెస్ హఠావో అన్న నినాదంతోనే పాలిటిక్స్ లోకి వచ్చారు.
ఐతే ఇప్పుడు అదే కాంగ్రెస్ పరిపాలిస్తున్న కరణాటక ప్రభుత్వం సపోర్ట్ కోసం వెళ్లారు. సిద్ధారామయ్యతో పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐతే ఈ మీటింగ్ కేవలం ఏనుగులను తీసుకు రావడం కోసమే కాదు వెనక మరో పెద్ద ప్లన్ ఉందని టాక్. పవన్ కళ్యాణ్ సిద్ధారామయ్యతో చర్చల వెనక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని టాక్. ఆయన ఎందుకు అంటే ఈమధ్య జగన్ కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వచ్చారని. ఇండియా కూటమికి వైసీపీ సపోర్ట్ ఇచ్చేలా ఉందని అంటున్నారు.
జగన్ ని ఒంటరి చేయాలనే ఆలోచన..
ఐతే జగన్ వైసీపీ తరపున ఇండియా కూటమికి సపోర్ట్ చేసేలా పావులు కదులుతున్నాయి. ఈమధ్య ఇంటియా కూటమి ముఖ్యన్ నేతలతో వైసీపీ అధినేత కలవడం మాట్లాడటం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ఇండియా కూటమికి దాదాపు సపోర్ట్ ఇస్తున్నట్టుగానే తెలుస్తుంది. బయట పడట్లేదు కానీ ఇటు బీజేపీలో టీడీపీ ఉంది కాబట్టి జగన్ కచ్చితంగా ఇండియా కూటమికి సపోర్ట్ చేయాల్సిందే.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్.. మధ్యలో టీడీపీ..?
ఐతే జగన్ ని ఒంటరి చేసే ఆలోచనలో భాగంగా పవన్ నుంచి అతన్ని ఇండియా కూటమిలో జాయిన్ చేసుకోవద్దు అన్న సమాచారాన్ని అందిస్తున్నారని తెలుస్తుంది. ఐతే చంద్రబాబు చెబితే కాంగ్రెస్ పెద్దలు చేస్తారా అంటే.. టీడీపీ చెప్పిన మాట వింటేనే ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. జగన్ ని ఒంటరిని చేసి పార్టీ నిర్వీర్యం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని టాక్. మొత్తానికి జగన్ ఏమో ఇండియా కూటమికి దగ్గరవ్వాలని చూస్తుంటే బాబు మాత్రం ఆయన ప్లాన్ ని తిప్పికొట్టాలని చూస్తున్నారు.