MP Vemireddy : వైసీపీ ఏం తక్కువ చేసింది వేమిరెడ్డి నీకు..?
ప్రధానాంశాలు:
MP Vemireddy : వైసీపీ ఏం తక్కువ చేసింది వేమిరెడ్డి నీకు..?
MP Vemireddy : ఏపీలో 2024 ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని వారు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. అయితే ఈ లిస్టులోకి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లుగా సీఎం జగన్ కు లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల వలన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. అయితే వీరి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రాజకీయ నాయకులు చాలామంది వారు ఎమోషనల్ అవుతున్నట్లు బయట ప్రపంచానికి తెలియడానికి ఇష్టపడరు. మరి ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఎమోషనల్ యాంగిల్ ని బయటకు చూపించడానికి అస్సలు ఇష్టపడరు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వలన జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా ఎమోషనల్ అయ్యారు అనే మాట చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి రాజ్యసభ ఎంపీ. ఆయనకు ఇంకా పదవి కాలం కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేశారు అనేటువంటి మాట చాలా గట్టిగా వినిపిస్తోంది. అయితే తెలుగుదేశం నుంచి ఆయనకు ఎలాంటి ప్రామిస్ వచ్చిందనే విషయాలు మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన తీసుకున్న విషయంలో చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి అన్నగా భావిస్తూ ఉంటారు. ఇక ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి చాలా చేశారు .అయినప్పటికీ కూడా ఎందుకు వేమిరెడ్డి రాజీనామా చేశారు. ఇక నెల్లూరుకి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ తో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాస్త విభేదాలు ఉండడంతో అనిల్ కుమార్ యాదవ్ ను ఇక్కడి నుంచి తొలగించి నరసరావుపేటలో టికెట్ ఇచ్చారు.
అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి రెడ్డికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన కోసం అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తిని తీసుకెళ్లి నరసరావుపేటలో టికెట్ ఇస్తారు అర్థమవుతుంది. ఇక వేమిరెడ్డికి కూడా నెల్లూరు ప్రాంతంలో టికెట్ ఇవ్వాలని ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఆయన భార్య కు కూడా టీటీడీ సంబంధించి మెంబర్ గా మంచి పదవి ఇచ్చాను. అంతేకాక ఢిల్లీలో స్థానిక సలహా మండలి చైర్మన్ గా కూడా వేమిరెడ్డి ని నియమించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి వీరి కోసం చాలానే చేసుకుంటూ వచ్చారు. అయితే ఒకపక్క వల్లభనేని బాలశౌర్య వంటి వారిని చూస్తే జగన్ కు చాలా సన్నిహితంగా ఉంటారు. అలాంటి వారిని కూడా జగన్ మోహన్ రెడ్డి పక్కన పెట్టారు కానీ వేమిరెడ్డి కి మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా చేశారు. అయినా కానీ ఆయన పార్టీ వదిలిపెట్టడంతో వీరి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే రాజకీయాలలో ఎదురు దెబ్బ కొట్టడమే కాదు , అప్పుడప్పుడు మనకి కూడా ఎదురు దెబ్బలు తగులుతానే విషయం ఇప్పుడు జగన్ కు స్పష్టంగా అర్థం అయిందని పలువురు అంటున్నారు. అయితే వేమిరెడ్డి రాజీనామా నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.