Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి దీ తెలుగు న్యూస్ నుంచి ఒకే ఒక్క స్ట్రెయిట్ QUESTION ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి దీ తెలుగు న్యూస్ నుంచి ఒకే ఒక్క స్ట్రెయిట్ QUESTION !

 Authored By kranthi | The Telugu News | Updated on :21 June 2023,12:00 pm

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రే ట్రెండింగ్. ఎక్కడ చూసినా ఆ యాత్ర గురించే ట్రెండింగ్ నడుస్తోంది. దానికి కారణం.. వారాహి యాత్రలో పలు చోట్ల బహిరంగ సభలు పెట్టి మరీ ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై వ్యక్తిగతంగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. వైసీపీ పార్టీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై కూడా పవన్ రెచ్చిపోతుండటంతో.. ఆయనకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబును సీఎం చేస్తామని చెప్పినా కూడా కాపులు ఎవ్వరూ ఆయన వెంట వెళ్లడం లేదు. అందుకే.. ఇక తప్పేది లేక తానే సీఎం అవుతానంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నరు పవన్ కళ్యాణ్. అంటే.. పవన్ కళ్యాణ్ అంతిమంగా పనిచేసేది ఎవరి కోసమో అర్థం అవుతోంది కదా అంటూ విమర్శల వర్షం కురిపించారు.

అది వారాహి యాత్ర కాదు. నారాహి అబద్ధాల యాత్ర. అబద్ధాలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికి ప్రమాదమో అందరికీ తెలుసు. అసలు.. పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయంగా వైసీపీకి ఎలాంటి ప్రమాదం లేదని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కాపులు లేకపోతే జనసేన లేదని.. తాను లేనని గప్పాలు పలుకుతున్న పవన్ కళ్యాణ్.. కాపుల్లో తనపై సానుభూతి తగ్గింది అని అనుకున్నప్పుడల్లా ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. సొల్లు కబుర్లు చెబుతూ టైమ్ పాస్ చేస్తుంటారు. తనకు నిజంగానే ప్రాణహాని ఉంటే.. అది చెప్పాల్సింది బహిరంగ సభలో కాదు.. పోలీసులకు అంటూ పేర్ని నాని మండిపడ్డారు. తన చుట్టూ పవన్ కళ్యాణ్ సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. కనీసం తన అభిమానులను కూడా రానివ్వడం లేదు.

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : తన చుట్టూ సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని అభిమానులను కూడా రానివ్వడం లేదు

అభిమానులను పక్కన పెడితే.. తన పార్టీలో పనిచేసే నాయకులను కూడా తన దగ్గరికి, తన పక్కన నిలబడటానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదు. పవన్ కు అసలు ప్రాణహాని ఉంటే అది చంద్రబాబుతోనే. ఎందుకంటే.. వైఎస్ జగన్ కు బురద అంటించాలని.. పవన్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయినా వెనుకాడరు. అందుకే.. చంద్రబాబుతోనే పవన్ జాగ్రత్తగా ఉంటే బెటర్. చంద్రబాబు చేసిన పాపాలకు లెక్క ఉందా? ఆయన చేసిన పాపాలకు ఎన్నిసార్లు గుడ్డలు ఊడదీసి కొట్టాలి.. అంటూ పేర్ని నాని.. పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. మరి.. వీటికి పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉందా?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది