pawan Kalyan : పాక్ పై మీకు అంత ప్రేమ ఉంటె అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలకు పవన్ కల్యాణ్ సూచన..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

pawan Kalyan : పాక్ పై మీకు అంత ప్రేమ ఉంటె అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలకు పవన్ కల్యాణ్ సూచన..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  pawan Kalyan : పాక్ పై మీకు అంత ప్రేమ ఉంటె అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలకు పవన్ కల్యాణ్ సూచన..!

pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై తీవ్రంగా స్పందించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్, కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని స్పష్టం చేశారు. భారత దేశం ఇప్పటికే మూడు సార్లు పాకిస్తాన్‌ను ఓడించిందని గుర్తు చేస్తూ, దేశంపై విశ్వాసం మరియు గౌరవం లేకుండా పాక్‌కు మద్దతు పలుకుతున్నవారు ఆ దేశానికే వెళ్లిపోవాలంటూ కాంగ్రెస్ నేతలపై ఘాటుగా వ్యాఖ్యానించారు.

pawan Kalyan పాక్ పై మీకు అంత ప్రేమ ఉంటె అక్కడికే వెళ్లిపోండి కాంగ్రెస్ నేతలకు పవన్ కల్యాణ్ సూచన

pawan Kalyan : పాక్ పై మీకు అంత ప్రేమ ఉంటె అక్కడికే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలకు పవన్ కల్యాణ్ సూచన..!

pawan Kalyan : అలాంటప్పుడు మీరంతా పాక్ కు వెళ్లిపోవచ్చు.. కాంగ్రెస్ నేతలపై పవన్ కామెంట్స్

పవన్ కల్యాణ్ విమర్శలు ప్రధానంగా పాక్‌ కు సపోర్ట్ గా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులపై దృష్టి సారించాయి. పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశంగా మారిందని, దాని వల్లే కశ్మీర్ పండిట్లు వలస పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్‌లో జరిగిన దాడిలో మతాన్ని అడిగి, తర్వాత దారుణంగా పర్యాటకులను హత్య చేసిన తీరును వివరించుతూ, ఇలాంటి ఉగ్రవాదులపై జాలి చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భారత్ సహనంతో ఉండటం మంచి విషయం అయినా, ఇప్పుడు ఆ సహనం మరింత ఎక్కువైందా అనే సందేహం కలుగుతోందని అన్నారు.

దేశంలో ఉగ్రదాడిపై అందరూ ఏకమై ఉన్న పరిస్థితిని పవన్ కల్యాణ్ హర్షించారు. ప్రధాని మోదీని విమర్శించే వారు కూడా ఈ దాడి సందర్భంలో మద్దతు ఇస్తున్నారని చెప్పారు. భారతదేశం ఇప్పుడు మరింత శక్తివంతంగా, సమైక్యంగా ఉందని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా వాసి మరియు ఈ దాడిలో మృతి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి జనసేన తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. ఉగ్రవాదంపై అవగాహన పెంచాలని, దేశభక్తిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది