Vijayasai Reddy : ఇదంతా జగన్ స్కెచ్‌లో భాగమా.. వారంలో రెండోసారి అమిత్‌షాని కలిసిన సాయిరెడ్డి..!
ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. 11 సీట్లకే తన పార్టీ పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ వచ్చే ఏడాది బంపర్ మెజారిటీతో గెలవాలనే కసితో పని చేస్తున్నారు.వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు అంతుబట్టవు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఏపీలో చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ దుమ్మెత్తి పోస్తుండగా, మరోవైపు ఢిల్లీలో సైలెంట్‌గా పావులు కదుపుతోంది ఆ పార్టీ. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ వారంలో రెండుసార్లు కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? అన్న చర్చ ఏపీలో మొదలైంది.
Vijayasai Reddy : భేటిల వెనక రహస్యం ?
తే విజయసాయిరెడ్డి గత వారం రోజుల వ్యవధిలో హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది రెండోసారి. అమిత్ షాతో భేటీలు ఎందుకు అన్నది బయటకు తెలియకపోయినా పుకారులు అయితే షికారు చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం ఓ వైపు నడుస్తుంది.. వైసీపీలో నెంబర్ టూగా చలామణి అవుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ వారంలో రెండుసార్లు కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం కావడంపై అనేక ప్రచారాలు జరుగుతున్నా కూడా ఈ భేటీ వెనుక కారణాలు చాలానే ఉన్నాయన్నది రాజకీయ నేతల మాట. ఎన్డీయే సర్కార్‌లో చంద్రబాబు పాత్ర చాలా కీలకం. మోదీ సర్కార్ ఐదేళ్లు నడవాలంటే కచ్చితంగా టీడీపీ మద్దతు ఉండాల్సిందే.
తమపై ఎలాంటి కేసులు పెట్టవద్దని, తమకు కేంద్రం అండ ఉందని చెప్ప డానికే జగన్ ఈ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సందేశం చంద్రబాబు సర్కార్‌కు పంపిస్తున్నారా అన్న డౌట్ మొదలైపోయింది. ఐదుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ లోకి పంపాలన్నది జగన్ ప్లాన్. ఈ విషయమై అమిత్ షాతో విజయసాయిరెడ్డి మాట్లారన్నది దాని వెనుక సారాంశం. సాయిరెడ్డి చెప్పింది అదే అని, షా విన్నారని అంటున్నారు. అలాకాకుండా పార్టీని బీజేపీలో కలిపేస్తామ నే సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. చెప్పిందంతా విని అమిత్ షా సైలెంట్ అయ్యారని అంటున్నారు. రానున్న రోజులలో అయిన దీనిపై క్లారిటీ వస్తుందా చూడాలి.