YS Sharmila : వై.యస్.షర్మిల ఎంట్రీ తో ఏపీలో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : వై.యస్.షర్మిల ఎంట్రీ తో ఏపీలో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లడం తథ్యం అని తేలిపోయింది. ఆమె కేవలం ఏపీలో ఓట్లు చీల్చడం కోసమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అధికారం పొందే అవకాశం ఏపీ కాంగ్రెస్ కి లేదు. అయినా కూడా ఆమె ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో చేసినట్లుగా ఏపీలో కూడా 100 రోజులు పాదయాత్ర వై.యస్.షర్మిల చేస్తారని వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ సీపీ పార్టీలో సీట్లు కోల్పోయిన వాళ్లు వై.యస్.షర్మిలకు మద్దతు ఇస్తే కచ్చితంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 January 2024,4:00 pm

వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లడం తథ్యం అని తేలిపోయింది. ఆమె కేవలం ఏపీలో ఓట్లు చీల్చడం కోసమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అధికారం పొందే అవకాశం ఏపీ కాంగ్రెస్ కి లేదు. అయినా కూడా ఆమె ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో చేసినట్లుగా ఏపీలో కూడా 100 రోజులు పాదయాత్ర వై.యస్.షర్మిల చేస్తారని వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ సీపీ పార్టీలో సీట్లు కోల్పోయిన వాళ్లు వై.యస్.షర్మిలకు మద్దతు ఇస్తే కచ్చితంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు కి లాభం చేకూరుతుంది అని అంటున్నారు. అలా కాకుండా ఆమె చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారని అనుమానాలు వచ్చాయి. అయితే వై.యస్.షర్మిలను నడిపించిన కాంగ్రెస్ నేత దేవేందర్ రెడ్డి టీడీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటేనే వై.యస్.జగన్మోహన్ రెడ్డిని ఓడించగలరని అన్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి కూతురిగా వైయస్ షర్మిల కు ఏపీ ప్రజలు మద్దతు ఇస్తారని, గణనీయమైన ఓటు బ్యాంకు కూడా పెరగబోతుంది అని, వై.యస్.షర్మిల ఎంట్రీ తర్వాత రాష్ట్ర రాజకీయం మారబోతుందని, చంద్రబాబు నాయుడు షర్మిలను టీడీపీలోకి చేర్చుకుంటారని, దీంతో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారని దేవేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నిజంగానే వై.యస్.షర్మిల చంద్రబాబు నాయుడుని కలిస్తే వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకత అవుతుంది. అయితే దీనివలన వై.యస్.షర్మిలకు ఎక్కువ దెబ్బ పడుతుంది. ఎందుకంటే బ్రతికినంత కాలం చంద్రబాబు పాలసీల మీద, మాట మీద అన్యాయాల మీద పోరాటం చేస్తానని చెప్పుకొచ్చిన వై.యస్.షర్మిల

ఇప్పుడు చంద్రబాబుతో కలిస్తే వై.యస్.రాజశేఖర్ రెడ్డి కి సపోర్ట్ చేసేవాళ్లు ఆమెను సపోర్ట్ చేయరు. కాంగ్రెస్ నాయకులు మంచో చెడు వై.యస్.జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు తప్ప చంద్రబాబుకి అస్సలు సపోర్ట్ చేయరు. పొత్తు వలన జనసేన చంద్రబాబు నాయకత్వం కిందికి వచ్చినట్లు అయింది. ఇప్పుడు వై.యస్.షర్మిల కాంగ్రెస్ కూడా అంతే అవుతుంది. రాబోయే 10 , 15 రోజుల్లో వై.యస్.షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటివరకైతే ఆమె ఎంట్రీ వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఇక తెలంగాణలో మాత్రం ఆమె పోటీ చేయకుండా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది